“కాంగ్రెస్ పార్టీకి ధైర్యవంతులు కావాలి” -రాహుల్ గాంధీ!

Share Icons:
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే భయపడేవాళ్లు కాంగ్రెస్ లో ఉండనక్కర్లేదు
  • తమకు అక్కర్లేని వారిని బయటికి సాగనంపుతాం
  • బీజేపీ అంటే భయపడని వారందరినీ తమ వారిగానే భావిస్తాం

పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే కార్యకలాపాలకు పాల్పడేవారికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే భయపడేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండనక్కర్లేదని తేల్చిచెప్పారు.  వాళ్లు తమకు అక్కర్లేదని, వారిని బయటికి సాగనంపుతామని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో లేని వారు కూడా చాలామంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారని, బీజేపీ అంటే భయపడని వారందరినీ తమ వారిగానే భావిస్తామని పేర్కొన్నారు. అలాంటి వారిని పార్టీలోకి తీసుకురండి అని కాంగ్రెస్ శ్రేణులకు ఉద్బోధించారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply