వారికి వ్యతిరేకంగా జాతి ఏకమవుతోంది…

Rahul Gandhi Fires on Bjp Government
Share Icons:

ముంబై, 13 జూన్:

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), బీజేపీకి వ్యతిరేకంగా జాతి ఏకమవుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

మహారాష్ట పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడాలని రాజకీయనాయకులు, ప్రజలు బలంగా అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

ఇక రాజ్యాంగం, ఇతర వ్యవస్థలపై ప్రధాని, ఆయన ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు.

ఇంధనం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వాటి ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని విపక్షాలు కోరుతున్నప్పటికీ ప్రధాని ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదని విమర్శించారు.

ధనవంతుల ప్రయోజనాలే తప్ప సాధారణ ప్రజల గోడు మోదీకి ఏమాత్రం పట్టడం లేదని రాహుల్ మండిపడ్డారు.

గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌(జీఎస్‌టీని విమర్శిస్తూ) పేరుతో చిన్న పరిశ్రమలు, వస్త్ర వ్యాపారంపై ప్రభుత్వం దాడి చేస్తోందని అన్నారు.

ఇక పెద్దనోట్ల రద్దు వల్ల యావత్‌ దేశం బాధపడుతోందని, ప్రజల తరఫున తాము పోరాడుతున్నామని చెప్పారు. కాగా, మహాకూటమికి ఎవరు సారథ్యం వహిస్తున్నారన్న దానిపై మాత్రం రాహుల్‌ స్పందించలేదు. ‌

మామాట: అంటే మీకు సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తాలేదనేగా….

Leave a Reply