బీజేపీ అడ్డాలో అన్నాచెల్లెల రోడ్ షో…

Share Icons:

లక్నో, 11 ఫిబ్రవరి:

యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీకి ఈస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెకట్రరీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా తన అన్న, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి…నేడు యూపీ రాజధాని లక్నోలో పర్యటించనున్నారు.

రాహుల్, ప్రియాంకా రాక సందర్భంగా లక్నో ఎయిర్ పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ రోడ్ షో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. అనంతరం పార్టీ ఆఫీస్‌లో యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక వీరిద్దరు ఈ నెల 14 వరకు అక్కడే ఉంటారు. రాహుల్ గాంధీ మాత్రం ఈరోజు రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు

ఇక వీరి పర్యటనతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆమె రాకతో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సోమవారం జరిగే రోడ్‌షోను సార్వత్రిక ఎన్నికల ప్రచార శంఖారావంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు లక్నోలో జరుగుతున్న పరిణామాలను అధికార బీజేపీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రియాంక గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్న కమలదళం…ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ప్రియాంక గాంధీ ఏం మాట్లాడతారా? దానిపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

మామాట: మొత్తానికి చెల్లెలు అన్నతో కలిసి రాజకీయ రణరంగంలోకి దిగుతుంది…

 

Leave a Reply