నేను ఎప్పుడూ వైఎస్సార్ సీపీ అనే పదం పలకలేదు…

Share Icons:

విజయవాడ, 30 జూలై:

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ న్యూస్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తన నోటి నుంచి వైయస్సార్సీపీ అనే పదం ఎప్పుడూ బయటకు రాదని, తనెప్పుడూ జగన్ పార్టీ అనే పిలుస్తానని అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని, అందుకే తాను ఎప్పుడూ ఆయన పేరుతో ఆ పార్టీని పిలవకూడదనే, జగన్ పార్టీ అని పిలుస్తుంటానని తెలిపారు. వైయస్ పేరుతో ఉన్న ఆ పార్టీని సమర్థించాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఇక తాను వేరే పార్టీలలోకి వెళుతున్నట్లు రకరకాల ప్రచారాలను చేశారని… కానీ తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఏపీలో 90 శాతం మంది కాంగ్రెస్ నేతలు పదవి, సంపాదన కావాలనుకున్న వారంతా పార్టీని వదిలి వెళ్లిపోయారని, కానీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయని చెప్పారు.

మామాట: మొత్తానికి గట్టి పట్టుదలతోనే ఉన్నారు….

Leave a Reply