Radhe Shyam Record: మరో మైలురాయి దాటేసిన రాధే శ్యామ్.. విడుదలైన 24 గంటల్లోనే!!

Share Icons:
20వ సినిమా ” వరుస రికార్డ్స్ నమోదు చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. శుక్రవారం (జులై 10) రోజున విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ట్విట్టర్ వేదికపై తెగ హంగామా చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే 3.8 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్ని ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించిన ఈ పోస్టర్ తాజాగా మరో మైలురాయి దాటేసింది.

విడుదలైన 24 గంటల్లోనే ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ 6.3 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి ట్విట్టర్ వేదికపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ మేరకు డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్‌లుక్ తోనే ఈ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుండటం పట్ల రెబల్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ప్రభాస్- పూజా హెగ్డే బార్బిడాల్ డ్యాన్స్ మూమెంట్‌తో ల‌వ్‌లీగా రొమాంటిక్ స్టిల్ ఇచ్చి కనువిందు చేశారు. అయితే ఈ పోస్టర్ గతంలో వచ్చిన ‘కంచె’ సినిమా పోస్టర్‌ని పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ తనదారిలో తానూ వెళ్తూ రికార్డుల వేట మొదలెట్టింది ‘రాధే శ్యామ్’ మూవీ.

Also Read:
గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 1960 దశకం నాటి ప్రేమకథతో ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రొమాంటిక్ కిక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.