రబాడపై నిషేధం ఎత్తేసిన ఐసీసీ….

Share Icons:

కేప్‌టౌన్, 20 మార్చి:

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడపై ఉన్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ ఎత్తేసింది. దీంతో ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు.

ఈ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రబాడ కావాలని ఢీకొట్టాడన్న ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐసీసీ విచారణ చేపట్టి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అలాగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధించారు.

అయితే రబాడ, స్మిత్‌ను కావాలని ఢీకొట్టినట్లుగా తాను భావించడం లేదని, అందుకే అతన్ని వదిలేస్తున్నట్లు ఐసీసీ జుడీషియల్ కమిషనర్ మైకేల్ హెరాన్ చెప్పారు.

కానీ రబాడా మాత్రం క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడని, సహచర ఆటగాడికి తగిన గౌరవం ఇవ్వలేదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో అతనికి 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. మళ్లీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెరాన్ చెప్పారు. ఇక జుడీషియల్ కమిషన్ నిర్ణయాన్ని అంగీకరిస్తూ, రబాడాపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తేసింది.

మామాట: ఇది దక్షిణాఫ్రికా జట్టుకి శుభవార్తే….

English summary:

Kagiso Rabada has been cleared to play in the third Test against Australia this week after a judicial commissioner ruled there was no conclusive evidence that the South African fast bowler’s contact with Steve Smith in the second Test was deliberate.

One Comment on “రబాడపై నిషేధం ఎత్తేసిన ఐసీసీ….”

Leave a Reply