టీడీపీకి ఆర్.కృష్ణయ్య రాజీనామా?

Share Icons:

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10:

తెలంగాణలో ‘ముందస్తు’ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాలన్ని కలిసి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి వ్యూహాలు రచిస్తుంది. దీనిలో భాగంగా మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.

పొత్తులతో తమకు పదవీ గండం ఉందనే భయంతో కొందరు నేతలు తమకు అనుకూలంగా ఉండే విధంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానాలు నేతలను బుజ్జగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం బీసీ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పార్టీ తీరుపై అదేవిధంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

2014ఎన్నికల్లో తనను టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఏనాడూ కనీస మర్యాద ఇవ్వలేదని ఆర్‌, కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తన అనుచరులతో కలిసి రాజకీయ భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు గురించి కనీసం ఒక్క మాటైనా తనతో చెప్పలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను, బీసీలను టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కృష్ణయ్య సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరతారన్న విషయంపై స్పష్టత రావాలని కృష్ణయ్య అనుచరులు పేర్కొన్నారు.

మామాట: మరి ఏ పార్టీలో చేరతారో?

Leave a Reply