ఆ కేసుతో మాకేం సంబంధం లేదు….

purandeswari comments on babli project case
Share Icons:

విజయవాడ, 14 సెప్టెంబర్:

బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరీ అన్నారు. ఈరోజు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… 2010 నాటి కేసుకు సంబంధించి టీడీపీ నేతలు బీజేపీపై ఎలా నిందలు వేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై ఏమైనా సందేహాలుంటే, మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని, ఏం జరిగినా కేంద్రానికి ఆపాదించడాన్ని టీడీపీ తన నైజంగా మార్చుకుందని మండిపడ్డారు.

ఇక ఆపరేషన్ గరుడ అంటే తనకు తెలియదని, అసలు ఆపరేషన్ గరుడతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని గుర్తు చేసిన ఆమె, దాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడివున్నామని వెల్లడించారు.

అలాగే ఏపీకి నిధుల కేటాయింపులో ఎన్నడూ అన్యాయం జరగలేదని, కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా డబ్బు విడుదలలో జాప్యం జరిగి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

మామాట: అసలు చివరికి ఈ కేసు ఏం అవుతుందో..

Leave a Reply