ముష్ఠి టాస్కులు ఇవ్వొద్దంటూ బిగ్ బాస్ ని ఏకిపారేసిన పున్నూ…

punarnavi serious warning to big boss
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్ అవ్వడం బుధవారం ఎపిసోడ్లో కూడా కొనసాగింది. మంగళవారం ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లో పడేసిన విషయం తెలిసిందే. దీంతో పున్నూ చెత్త టాస్క్ లు ఇస్తున్నారంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది. అయితే ఈ టాస్క్ బుధవారం కూడా కొనసాగడంతో పున్నూ బిగ్ బాస్ పై మండిపడుతూనే ఉంది. ఇలాంటి ముష్టి టాస్క్‌లు మాకు ఇవ్వొద్దు. ఇలాంటి గేమ్స్ మీరే ఆడుకోండి. బిగ్ బాస్ అనే వాడు ఎప్పుడు క‌రెక్ట్ కాదు. మేం వంద శాతం ఎఫ‌ర్ట్ పెడితే స‌డెన్‌గా ర‌ద్దు చేస్తారు.

కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్ తప్పైతే బయటకు పోతా. టాస్క్ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఉండాలి.. సిల్లీ గేమ్స్ ఇవ్వకు’ అంటూ బిగ్ బాస్‌ని ఏకి పారేసింది. అయితే టాస్క్ లో భాగంగా మంగళవారం దెయ్యాలుగా ఉన్న హిమజ, శిల్ప, వితికలు మనుషులుగా ఉన్న శ్రీముఖి,పునర్నవి,వరుణ్ లని చంపేసి వారు మనుషులుగా మారారు. `ఇక చనిపోయిన వారు దెయ్యాలుగా మారారు. అలఎగ్ బుధవారం ఎపిసోడ్ లో దెయ్యాలుగా ఉన్న బాబా భాస్కర్,రాహుల్ లు రవి, మహేశ్ లని చంపేసి మనుషులుగా మారిపోయారు.

అయితే దెయ్యంగా పున్నూ టాస్క్ చేయనని ముందే చెప్పేసింది. ఇక రవి, శ్రీముఖి, మహేశ్, వరుణ్ లు కూడా టాస్క్ చేయలేమని చెప్పేయడంతో టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే టాస్క్ నియ‌మాల‌ని స‌రిగ్గా పాటించని శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌ల‌కి బిగ్ బాస్ ప‌నిష్మెంట్ ఇచ్చారు. మోస్ట్ వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా వారి ముగ్గురిని ప్ర‌క‌టిస్తూ శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు షూ పాలిష్ శిక్ష విధించారు. శ్రీముఖి ఆ ప‌ని చేసేందుకు ముందుకు వ‌చ్చింది. కాని పున‌ర్న‌వి, మ‌హేష్‌లు ఇలాంటి ప‌నులు మేం చేయ‌డానికి ఇక్క‌డ‌కి రాలేదంటూ మోండికేసి కూర్చున్నారు.

మిగ‌తా ఇంటిస‌భ్యులు వీరిద్ద‌రిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసిన ఓ మెట్టు కూడా దిగి రాలేదు. చివ‌ర‌లో మ‌హేష్ కొంత కాంప్ర‌మైజ్ అయి టాస్క్ లో పాల్గొన్నాడు. పున‌ర్నవి మాత్రం నేను బ‌య‌ట‌కి అయిన పోతా కాని ఇలాంటి చీప్ టాస్క్‌లు చేయ‌నంటూ బిగ్ బాస్ ఆదేశాల‌ని బేఖాత‌రు చేసింది. అయితే శిక్ష పాటించ‌క‌పోతే వ‌చ్చే వారం డైరెక్ట్‌గా నామినేట్ అవుతావు అని బిగ్ బాస్ చెప్పిన తాను చేయ‌న‌ని మొండికేసింది.

 

Leave a Reply