నవరసాలు పండించిన హౌస్ మేట్స్: హౌస్ నుంచి పున్నూ ఔట్

punarnavi-out-of-the-biggboss3-telugu
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇంటిలోని 9 మంది సభ్యులలో ఆదివారం ఎపిసోడ్లో పునర్నవి ఇంటి నుంచి బయటకెళ్లిపోయి 8 మంది సభ్యులు మిగిలారు. ఈ ఎలిమినేషన్ కంటే ముందు నాగార్జున ఇంటి సభ్యులకు నవరాత్రులు సందర్భంగా నవరసాలు అనే టాస్క్ ఇచ్చారు.  ఈ నవరసాలను మాకు చూపించాలని 9 మంది సభ్యులు ఒక్కో రసాన్ని చూపించాలన్నారు. దీనికి మార్కులు కూడా ఉంటాయని అనడంతో పెర్ఫామెన్స్‌తో రెచ్చిపోయారు కంటెస్టెంట్స్.

మొదటిగా వరుణ్ సందేశ్‌కి శాంతం రసం ఇవ్వడంతో బాగానే కష్టపడ్డాడు. ఏదో తనకు తగ్గట్టుగా శాంత రసం పండించాడు. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి పర్శనాలిటీకి తగ్గట్టుగానే శృంగార రసం పండించాలని టాస్క్ ఇచ్చారు. ఇక గులాబీ రంగు లంగాఓణీతో వయ్యారాలు ఒలకబోస్తూ శృంగార రసాన్ని ఒలికబోస్తూ ఓ రేంజ్ పెర్పామెన్స్ ఇచ్చింది. ‘సిగ్గేస్తోంది.. నిను చూస్తుంటే.. సిగ్గేస్తోంది నిను చూస్తుంటే’ అంటూ వయ్యారాలను ఒలకబోసింది.

తర్వాత శివజ్యోతికి తగ్గట్టుగా కరుణ రసం ఇచ్చారు. ఆమె ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో ‘అనే పాటకు మంచి ప్రదర్శన ఇచ్చింది. అనంతరం బాబా భాస్కర్ బీభత్సం, శ్రీముఖి రౌద్రం రసాలని ఓ రేంజ్ లో పండించారు. తమ టాలెంట్ ని మొత్తం బయటపెట్టి వందకు వంద మార్కులు తెచ్చుకున్నారు. నెక్స్ట్ అలీ వీరం, రాహుల్ భయానకం, వితికా అద్భుత రసాలని చేసి పర్వాలేదనిపించారు. చివర్లో మహేష్ విట్టా.. బాబా భాస్కర్‌తో కలిసి చేసిన హాస్య రసం పొట్టచెక్కలు చేసింది. దీంతో మహేష్‌కి కూడా వందకు వంద మార్కులు వచ్చాయి.

ఇక సరదా టాస్క్ తర్వాత నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ వారం ఎలిమినేషన్ లో రాహుల్,వరుణ్, పునర్నవి, మహేష్ లు ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఎపిసోడ్లో రాహుల్ సేఫ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున… ఆదివారం ఎపిసోడ్లో వరుణ్, మహేష్ లు సేఫ్ అయ్యారని ప్రకటించారు. ఊహించని విధంగా పునర్నవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పునర్నవి హౌస్ నుండి బయటకు వస్తూ భావోద్వేగానికి గురైంది. ఇంటి సభ్యులు అందరికీ జాగ్రత్తలు చెప్పింది కాని.. రాహుల్‌తో మాట్లాడలేదు. కనీసం అతనితో ఫొటో దిగడానికి సైతం నో చెప్పింది. అయితే పున్నూ బయటకు వచ్చిన తరువాత రాహుల్ గుక్కపెట్టి ఏడ్చేశాడు. ఆమెను తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద పున్నూను చూసి తట్టుకోకపోయాడు రాహుల్.. ‘ఏమైపోయావే’ అంటూ పాట పాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు రాహుల్. ఇక పున్నూ ఈ వారం బిగ్ బాంబ్ ని బాబా మీద వేసింది. బిగ్ బాంబ్ ప్రకారం బాబా అలీకి సేవకుడుగా ఉండాలి.

 

Leave a Reply