బిగ్ బాస్: బాబాని టార్గెట్ చేసి ఓడించారుగా…

punarnavi group targetted baba bhaskar..and vithika-in-the-final-level-of-battle-of-the-medallion-task
Share Icons:

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో  గ్రూపుగా ఉన్న వరుణ్, పునర్నవి, రాహుల్, వితికాలు…బాబా భాస్కర్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చిన అలీ కూడా బాబానే టార్గెట్ చేసుకుని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ లో బాబానే టార్గెట్ చేశారు.  నిన్నటి ఎపిసోడ్‌లో బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 1 విజేతగా వితికాను రాహుల్-వరుణ్ కుమ్మక్కయి గెలిపించగా.. రెండో రోజు బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2లో బాబా భాస్కర్ సింగిల్‌గా గేమ్‌ని హ్యాండిల్ చేసి దటీజ్ బాబా అనిపించారు.

రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్‌‌లో బాబా భాస్కర్, శివజ్యోతి, శ్రీముఖి, అలీలు పోటీ పడగా శ్రీముఖి అందరికంటే ముందే వెనుతిరగగా.. అలీ సైతం వెనుతిరిగాడు. ఫైనల్‌గా శివజ్యోతి చాలాసేపు బాబాకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే బాబా భాస్కర్ తన డాన్స్ టాలెంట్ అండ్ బ్యాలెన్సింగ్‌తో ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకూ నిలిచి ఫ్రేమ్ టాస్క్‌లో విజేతగా నిలిచారు. అయితే బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 1‌లో విజేతగా నిలిచిన వితికాకి, బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్‌లలో అసలు విజేత ఎవరో తేల్చాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వదిలేశారు.

దీంతో ఈ ఇద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి బొట్టు పెట్టాలని, ఇష్టంలేని కంటెస్టెంట్‌ తలపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి, మహేష్ తప్పితే మిగిలిన వరుణ్, రాహుల్, అలీ, పునర్నవిలు వితికా గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ ఊహించనట్టే వితికాను బెస్ట్ పెర్ఫామర్‌ని చేసి బాబా తలపై గుడ్డు పగలగొట్టి విలన్‌ చేశారు. దీంతో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లో వితికా విన్నర్ గా నిలిచింది.

అయితే గేమ్ పూర్తైన తరువాత కూడా ఆడలేక మద్దెలదరువు అన్నట్టుగా పున్నూ అండ్ బ్యాచ్ బాబాపై స్పెషల్ డిస్కషన్ పెట్టారు. అతను హీరో మాదిరి ఆడి సింగిల్‌గా గేమ్ గెలిస్తే బాబా పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడని.. అతని నేచర్ అంతే అంటూ పునర్నవి మిగతా కంటెస్టెంట్స్‌కి సోది చెప్పింది. అసలు ఇంతవరకు సరైన గేమ్ ఆడకుండా నెట్టుకొచ్చిన పున్నూ బాబా గురించి మాట్లాడటం కామెడీగా అనిపించింది.

 

Leave a Reply