టెస్టుల్లో 2వ స్థానంలో పూజారా,5వ స్థానంలో కోహ్లీ…

Share Icons:

దుబాయ్, 29నవంబర్:

తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత టెస్ట్ ప్లేయర్ పూజారా కెరీర్‌లో మూడోసారి నెం:2 ర్యాంకుకు చేరుకుని తన సత్తాను నిరూపించుకున్నాడు.

నాగపూర్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 143 పరుగులు సాధించడంతో 22 పాయింట్లను తన ఖాతాలో వేసుకొని 888 పాయింట్లతో ఉన్నాడు.

ఇదే టెస్ట్‌లో డబుల్ సెంచరీ బాదిన విరాట్‌ 60 పాయింట్లను సాధించి ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. వీరిద్దరికి మధ్య 11 పాయింట్ల దూరం ఉంది.

ఇంకా మొదటిస్థానంలో గాబా టెస్ట్‌లో 141 పరుగులను సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అందరికి అందనంత ఎత్తులో 941 పాయింట్లతో  ఉన్నాడు.  అత్యధిక పాయింట్లను సాధించిన ఐదో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌గా స్మిత్‌ నిలిచాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ 3వ స్థానంలో,న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌న్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

బౌలింగ్‌లో 2 జడేజా, 4 అశ్విన్:

ఐసిసి బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మళ్లీ రెండో ర్యాంకును అందుకున్నాడు. 300 వికెట్ల తీసిన అశ్విన్‌ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

టి 20 సిరీస్‌లో కూడా విరాట్‌కు రెస్ట్‌?

ఇప్పటికే శ్రీలంక వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టి20 సిరీస్‌కు రెస్ట్‌ తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తెలిసే అవకాశం ఉంది. డిసెంబరు 12 వరకు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండలేనని కోహ్లీ సెలక్టర్లకు తెలిపాడు.

ఆ తర్వాత లంకతో టీ20ల్లో ఆడే దానిపై స్పష్టత ఇచ్చేందుకు కొంత సమయం అడిగాడు. 20,22, 24 తేదీల్లో టి20ల్లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు తక్కువ సమయం ఉండటంతో సన్నద్ధత కష్టమైవుతుందని కోహ్లీ ఇటీవల బిసిసిఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..

మామాట: విరామంలేని క్రికెట్ ఆడటం వలన ఏలాంటి ఆటగాడైన అలసిపోవలసిందే..

Leave a Reply