నింగిలోకి పిఎస్‌ఎల్వీ సి 46 

PSLVC C 46 Launch
Share Icons:

సూళ్లూరుపేట, మే21,

నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌(పిఎస్‌ఎల్వీ) సి46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయింది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పిఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ రాకెట్‌ 615 కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. దీని కాలపరిమితి ఐదేళ్లు. ముందుగా బుధవారం ఉదయం 5.27 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్ధాలు అడ్డు రానుండడాన్ని గుర్తించి మూడు నిమిషాల ఆలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

మామాట- శాస్త్రవేత్తలకు శుభాPSLVC C 46 Launchభినందనలు

Leave a Reply