మన తెలుగు సామెతలు (‘గ – ఘ -ఙ’ అక్షరములతో)

Share Icons:

గంగకు – దొంగకు – పంగకు తప్పులేదు
గంగలో మునిగినా కాకి హంస కాదు
గంగిగోవుపాలు గరిటెడైనా చాలు
గంజాయి తోటలో తులసి మొక్క
గంజి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడు
గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారట
గండం గడిచి పిండం బయటపడ్డట్లు
గంతకు తగిన బొంత
గంపలాభం చిల్లు తీసినట్లు
గజమూ మిధ్య – పలాయనమూ మిధ్య అన్నట్లు
గజ్జి ఉన్నవాడికి లజ్జ వుండదు
గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడు
గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది – తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుంది
గట్టుమీద వానికి గప్పాలెక్కువ
గడ ఎక్కు తిమ్మన్నా – గంతులు వేయి తిమ్మన్నా అన్నట్లు
గడించేది ఒకడు – అనుభవించేది మరొకడు
గడించే వాడొకడు – గుణించే వాడొకడు
గడిచి బ్రతికినామని గంతులు వేయరాదు
గడ్డివాము దగ్గర కుక్కలాగా
గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు
గడ్డ గడ్డకు గ్రుక్కెడు నీళ్ళు త్రాగినా రెడ్డే వ్యవసాయం చేయాలి
గడ్డ పలుగులు గాలికి కొట్టుకుపోతూంటే పుల్లాకు నా గతేంటి అన్నదట
గడియ పురసత్తు లేదు – గవ్వ ఆదాయం లేదు
గడ్డివామిలో సూది వెదికినట్లు
గతజల సేతు బంధనము
గతి చెడినా మతి చెడరాదు
గతిమాలిన వాడికి కుతిక లావు
గతిలేనమ్మకు గంజే పానకం
గద్దించే అత్త – మర్దించే మామ
గబ్బిలంలాగా అటు పక్షీ కాదు – ఇటు జంతువూ కాదు
గబ్బిలాయి ముఖంలాగా
గయ్యాళి, గచ్చపొద ఒకటే
గరిక మేసిన గాడిద చస్తుందిగానీ, గరిక చావదు
గురుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు
గరుత్మంతుణ్ణి చూచిన పాములాగా
గర్భాదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు
గర్భాదానానికి రమ్మని జాబువ్రాస్తే నాకు తీరికలేదు నేనున్నట్లుగానే జరిపించండని జాబు వ్రాసాట్ట
గాజుల చెయ్యి గలగల్లాడితే యిల్లు కళకళలాడుతుంది
గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు
గాడి తప్పిన బండివలె
గాడిదకేమి తెలుసు గంధపు వాసన?
గాడిదగుడ్డు
గాడిదకు గడ్డివేసి, ఆవును పాలిమ్మన్నట్లు
గాడిదకు భోగినీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట
గాడిదతో సేద్యం కాలి తాపులకే
గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు జడిస్తే ఎట్లా?
గాడిద పుండుకు బూడిద మందు
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే – ఒంటె అందానికి గాడిద ఆశ్చర్యపోయిందట
గాదె క్రింద ఎలుక గాదె క్రిందే బ్రతకాలి
గాదె క్రింద పందికొక్కులాగా
గానుగవాడి ఎద్దుగానూ – చాకలివాడి గాడిదగానూ పుట్టరాదు
గారాబం గజ్జెల కేడిస్తే – వీపు దెబ్బల కేడ్చిందట
గారెలు చేయవే పెండ్లామా అంటే వేలు మాత్రం చూపిందట
గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలి
గాలి కబుర్లు
గాలికి పుట్టి ధూళికి పెరిగినట్లు
గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు
గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం
గాలిని మూట కట్టగలం గానీ, గయ్యళి నోరు మూయలేం
గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు
గాలిలో మేడలు కట్టినట్లు
గిరాకీ కొననివ్వదు – మందం అమ్మనివ్వదు
గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగుతుందా?
గుండెల ఊపుడుకాదు తొడల తొక్కుడుకు తయారుకా అన్నాడట
గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?
గుడగుడ ఆలోచన గుడిసెకు చేటు
గుడారం గూని బ్రతుకు
గుడి దగ్గరయితే గురుత్వం దూరం
గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలు
గుడిని మింగే వాడికి లింగం అడ్డమా?
గుడిసేటి పనులు
గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు
గుడ్డి కంటికి మట్టి అద్దం
గుడ్డి కంటికి పగలైతేనే? రాత్రయితేనేం?
గుడ్డికన్నా మెల్ల మేలు
గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒక్కటే
గుడ్డి గుర్రానికి దాణా చేటు
గుడ్డి మొగుడికి రేచీకటి పెళ్ళాం
గుడ్డివాడి ఉపాయం గుడ్డివాడిది, గూనివాడి ఉపాయం గూనివాడిది
గుడ్డివాడి చేతిలో రాయి
గుడ్డివాడు ఎటు రువ్వినా గురే
గుడ్డివాళ్ళు ఏనుగులను తడిమి చూచి వర్ణించినట్లు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు
గురి కుదిరితే గుణం కుదురుతుంది
గురి తప్పినా పులినే కొట్టాలి – గుంటనక్కను కాదు
గురివిందగింజ తన ముడ్డిక్రింద నలుపెరగదు
గురువు నుంచుని త్రాగితే, శిష్యుడు పరిగెడుతూ త్రాగుతాడు
గురువును మించిన శిష్యుడు
గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు
గురువుకు పంగనామాలు పెట్టినట్లు
గురువులేని విద్య గుడ్డి విద్య
గుఱ్ఱము కడుపున గాడిదపిల్ల పుడుతుందా?
గుఱ్ఱము గుడ్డిదయినా దాణాకు తక్కువ లేదు
గుర్రానికి ముడ్డిలో కాలితే వరిగడ్డి తింటుంది
గుర్రానికి సకిలింత – సంగీతానికి ఇకిలింత వుండాలి
గుర్రాన్ని యేటివరకూ తీసికెళ్ళగలమే గానీ నీళ్ళు త్రాగించగలమా?
గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి పులిహోర కోరాడట
గుళ్ళో పిత్తక పోతే గుగ్గిలం వేసినంత పుణ్యం
గువ్వ గూడెక్కె – రాజు మేడెక్కె
గూట్లో దీపం – నోట్లో ముద్ద
గూనివాని ఒడుపు పడుకున్నపుడు చూడాలి
గూబ ఎక్కిన గృహము చెడును
గెలువని రాజుకు గొప్పలు మెండు
గేదె, దూడ వుండగా గుంజకు వచ్చెరా గురక వాయువు
గొంగడున్నంతే చాచుకోవాలి
గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్లు
గొంతుకలో వెలక్కాయ పడినట్లు
గొంతెమ్మ కోరికలు
గొడుగుమీద గొడుగుంటే పిడుగుమీద పిడుగు పడినట్లే
గొడ్డుకు ఒక దెబ్బ – మనిషికి ఒక మాట
గొడ్డుకి తిన్నది పుష్టి – మనిషికి ఉన్నది పుష్టి
గొడ్డు రైతుకు ఒక బిడ్డ
గొడ్డు వచ్చిన వేళ – బిడ్డ వచ్చిన వేళ
గొడ్డువాడు గొడ్డుపోయి ఏడుస్తుంటే మాదిగవాడు తోలు పోయిందని ఏడ్చాడట
గొడ్రాలికి గొంతు పెద్ద
గొడ్రాలికేమి తెలుసు ప్రసవ నొప్పులు
గొడ్రాలి తిట్టూ, గొడ్డలిపెట్టూ ఒక్కటే
గొప్పగా తెలిసినవారే గోతిలో పడతారు
గొఱ్ఱు గుచ్చిన నేలకు కొరత వుండదు
గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే
గొర్రె కసాయివాడినే నమ్ముతుంది
గొర్రెవాటు వేలం వెర్రి
గొర్రె బలిస్తే గొల్లకే లాభం
గొర్రెల మందలో తోడేలు పడ్డట్లు
గొర్రెలు గుంపు కూడితే గొప్ప వర్షం
గొల్లల గోత్రాలు గొర్రెలకు తెలిస్తే – గొర్రెల గోత్రాలు గొల్లల కెరుక
గొళ్ళెం లేని తలుపు – కళ్ళెం లేని గుర్రం
గోచీకి ఎక్కువ తుండుకు తక్కువ
గోచీకి మించిన దరిద్రం లేదు
గోచీపాతల రాయుడులాగా
గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు?
గోడుకు గోకుడే మందు
గోడకు కొట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు
గోడమీద పిల్లివాటము
గోడలకు చెవులుంటాయి – నీడలకు కళ్ళుంటాయి
గోతిని తీసినవాడే అందులో పడేది
గోతికాడ నక్కలాగా
గోముఖ వ్యాఘ్రం
గోరంత ఆలస్యం – కొండంత నష్టం
గోరంత దీపం – కొండంత వెలుగు
గోరంత వుంటే కొండంత చేసినట్లు
గోరుచుట్టుపై రోకలి పోటు
గోవు లేని వూళ్ళో గొడ్డే శ్రీమహాలక్ష్మి
గోవే తల్లి – ఎద్దే తండ్రి
గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది
గ్రహాలు గతులు తప్పినా, ఆడినమాట తప్పరాదు
గ్రాసంలేని కొలువు – మీసంలేని బ్రతుకు – రసం లేని కావ్యం ఒక్కటే

అక్షరంతో-

ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు
ఘోటక బ్రహ్మచారి లాగా

Leave a Reply