మన తెలుగు సామెతలు (‘క – ఖ’ అక్షరములతో)

Share Icons:

కంగారులో హడావుడి అన్నట్లు
కంచం, చెంబు బయటపారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు
కంచం పొత్తేగానీ, మంచం పొత్తు లేదు
కంచానికి ఒక్కడు – మంచానికి యిద్దరు
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది
కంచెమీద పడ్డ గుడ్డను మెల్లగా తీయాలి
కంచెలేని చేను, తల్లిలేని బిడ్డ ఒక్కటే
కంచె వేసినదే కమతమన్నట్లు
కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?
కంటికింపైతే నోటికీ యింపే
కంటికి తగిలే పుల్లను – కాలికి తగిలే పుల్లను కనిపెట్టి తిరగాలి
కంటికి రెప్ప దూరమా?
కంటికి రెప్ప – కాలికి చెప్పు
కంటివంటి ప్రకాశం లేదు – మంటివంటి ఆధారం లేదు
కండలేనివానికే గండం
కందం చెప్పినవాడు కవి – పందిని పొడిచినవాడు బంటు
కందకు లేదు, చేమకు లేదు, తోటకూర కెందుకు దురద?
కందకు లేని దురద కత్తిపీట కెందుకు?
కంది పండితే కరువు తీరుతుంది
కంప తొడుగు ఈడ్చినట్లు
కంపలో పడ్డ గొడ్డువలె
కంబళిలో తింటూ బొచ్చు ఏరినట్లు
కంసాలింటికెడితే బంగారమంటదుగానీ, కుమ్మరింటికెడితేమాత్రం మట్టి అంటుకుంటుంది
కంసాలికూడు కాకులు కూడా ముట్టవు
కంసాలి బర్రెనమ్ముతున్నాడు, లోపల లక్కవుందేమో చూడరా అన్నట్లు
కంసాలి దొంగతనం కంసాలికే తెలుస్తుంది
కక్కినకుక్క వద్దకూ కన్నకుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
కక్కిన కూటికి ఆశించినట్లు
కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపునొప్పి బాధ ఎరుగడు
కక్కుర్తి పడ్డా కడుపు నిండాలి
కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగవు
కటికవానికి కత్తి అందించినట్లు
కట్టని నోరూ, కట్టలేని నదీ ప్రమాదకరం
కట్టిన యింటికి వంకలు చెప్పేవారు మెండు
కట్టిన యిల్లు – పెట్టిన పొయ్యి
కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు ఇంకొకరు
కట్టినవాని కొక యిల్లయితే అద్దెకున్న వానికి అన్నీ యిళ్ళే
కట్టుకొన్న పెండ్లామే చేయాలి – కన్నతల్లే చేయాలి
కట్టుకొన్న మగడు – పెట్టెనున్న నగలు
కట్టుకొన్న వాడికంటే వుంచుకున్న వాడి మీదే ప్రేమ ఎక్కువ
కట్టు లేని ఊరు – గట్టు లేని చెరువు
కట్టెవంకర పొయ్యే తీరుస్తుంది
కట్టేవి కాషాయాలు – చేసేవి దొమ్మరి పనులు
కడగా పోయే శనీశ్వరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు
కడచిన దానికి వగచుట యేల?
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే
కడివెడు పాలలో ఒక్క ఉప్పుకల్లు
కడుపా కళ్ళేపల్లి చెరువా?
కడుపా – చెరువా?
కడుపుకు పెట్టిందే కన్నతల్లి
కడుపు కూటికేడిస్తే – కొప్పు పూలకేడ్చిందట
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
కడుపు చించుకున్నా గారడీ విద్యే అన్నట్లు
కడుపు నొప్పికి కంట్లో కలికం పెట్టినట్లు
కడుపు నిండితే గారెలు వగరు
కడుపుతో ఉన్నమ్మ కనక మానదు – వండుకున్నమ్మ తినక మానదు
కడుపున పుట్టిన బిడ్డ – కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి
కడుపు నిండిన బేరాలు – కడుపు నిండిన మాటలు
కడుపు మంట
కడుపులో ఎట్లా వుంటే కాపురమట్లా వుంటుంది
కడుపులో చల్ల కదలకుండా
కడుపులోని మంట కానరాని మంట
కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా?
కడుపులో లేని శాంతి కౌగిలింతలో దొరుకుతుందా?
కడుపు వస్తే కనే తీరాలి
కడుపే కైలాసం – యిల్లే వైకుంఠం
కతికితే అతకదు
కత్తి తలగడకాదు – కల నిజం కాదు
కత్తిపోటు తప్పినా కలం పోటు తప్పదు
కత్తిమీద సాము
కత్తు కలిస్తే పొత్తు నిలుస్తుంది
కత్తెరలో వాన కనకపు పంట
కథ అడ్డం తిరిగింది
కథ కంచికీ – మన మింటికీ
కథకు కాళ్ళు లేవు – ముంతకు చెవులు లేవు
కదిపితే కందిరీగల తుట్టె
కదిలిస్తే కంపు
కదిలిస్తే గచ్చపొద
కని గ్రుడ్డి, విని చెవుడు
కనిపెంచిననాడు కొడుకులుగానీ, కోడళ్ళు వచ్చాక కొడుకులా?
కనుమునాడు కాకి అయినా కదలదు
కనుమునాడు కాకి గూడా మునుగుతుంది
కనుమునాడు మినుము కొరకాలి
కన్నతల్లికి కడుపుకు పెడితే, పినతల్లికి పిర్రకాలిందట
కన్నతల్లికైనా మరుగుండాలి
కన్నమ్మకే పొగరు – ఉన్నమ్మకే పొగరు
కన్నామేగానీ, కడుపులో పెట్టుకుంటామా?
కన్ను ఎరుగకున్న కడుపు ఎరుగుతుంది
కన్ను గుడ్డిదయితే కడుపు గుడ్డిదా?
కన్ను చూచి కాటుక – పిర్ర చూచి పీట
కన్ను చూచిన దానిని నమ్ము – చెవి విన్నదానిని నమ్ము
కన్ను పోయేంత కాటుక ఎందుకు?
కన్ను ఎర్రబడ్డా, మిన్నెర్రబడ్డా కారక మానవు
కన్నూ మనదే – వేలూ మనదే అని పొడుచుకుంటామా?
కన్నె నిచ్చినవాణ్నీ, కన్ను యిచ్చినవాణ్నీ కడవరకూ మరువరాదు
కన్నొకటి లేదు గానీ కాంతుడు కాడా?
కన్యలో చల్లితే ఊదుకుని తినటానికయినా ఉండవు
కపటము బయట దేవుడు – ఇంట్లో దయ్యము
కప్పకాటు – బాపనపోటు లేవు
కప్పలు కూస్తే వర్షం పడుతుంది
కప్పి పెట్టుకుంటే కంపు కొట్టదా?
కమ్మ అండ గాదు – తుమ్మ నీడ కాదు
కమ్మకు వరస లేదు – కప్పకు తోక లేదు
కమ్మగుట్టు గడప దాటదు
కమ్మని రోగాలూ, తియ్యని మందులూ వుంటాయా
కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు
కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు
కయ్యానికైనా, వియ్యానికైనా సమవుజ్జీ కావాలి
కరక్కాయ – కన్నతల్లి
కరణం, కాపూ నా ప్రక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో చూస్తా అందట
కరణంతో కంటు కాటికి పోయినా తప్పదు
కరణం సాధువూ కాడు – కాకి తెలుపూ కాదు
కరణానికీ కాపుకీ జత – ఉలికీ గూటానికీ జత
కరణానికి తిట్టు దోషం – చాకలికి ముట్టు దోషం లేదు
కరణాన్ని, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు
కరణాలూ కాపులూ ఏకమయితే కాకులు కూడా ఎగురలేవు
కరవమంటే కప్పకు కోపం – విడవమంటే పాముకు కోపం
కరువుకు దాసరులైతే పదాలెక్కడ వస్తాయి?
కరివేపాకు కోసేవాడే వాడినట్లు
కరువుకాలంలో ఒల్లనివాడు పంటకాలంలో పంపమని వచ్చాడట
కరువుకు గ్రహణాలు మెండు
కరువునాటి కష్టాలుండవు గానీ కష్టాలనాటి మాటలుంటాయి
కరువులో అధికమాసం అన్నట్లు
కరువు మానుప పంట – మిడతల మానప పంట
కరువులో అరువు అన్నట్లు
కరువులో కవల పిల్లలు
కర్మ ఛండాలుని కంటే – జాతి ఛండాలుడు మేలు
కర్మకి అంతం లేదు
కర్కాటకం చిందిస్తే కాటకముండదు
కర్కాటకం కురిస్తే కాడిమోకు తడవదు
కర్ణుడు లేని భారతం – శొంఠి లేని కషాయం ఒక్కటే
కర్ణునితో భారతం సరి – కార్తీకంతో వానలు సరి
కర్ర చేత లేని వాణ్ణి గొర్రె కూడా కరుస్తుంది
కర్ర విరగకుండా – పాము చావకుండా
కర్రు అరిగితేనే కాపు బ్రతుకు
కలకాలం ఆపదలు కాపురముంటాయా?
కలకాలపు దొంగ ఒకరోజు దొరుకుతాడు
కల్పవృక్షాన్ని కాఫీపొడి అడిగినట్లు
కలల అలజడి కవ్వింతల రాజ్యం అన్నట్లు
కలలో జరిగింది ఇలలో జరగదు
కలలో భోగం కలతోటే సరి
కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు
కల్ల పసిడికి కాంతి మెండు
కలిగినదంతా కడుపు కోసమే – ఎంత పెంచినా కాటి కోసమే
కలిగిన వారికి అందరూ చుట్టాలే
కలిగినమ్మ గాదె తీసేటప్పటికి లేనమ్మ ప్రాణం పోయిందట
కలిగినమ్మ రంకు – కాషాయ బొంకు ఒక్కటే
కలిపి కొట్టరా కావేటి రంగా!
కలిమి ఉన్నంత సేపే బలగము
కలిమికి పొంగరాదు – లేమికి క్రుంగరాదు
కలిమి గలవాడే కులము గలవాడు
కలిమిగల లోభికన్నా పేద మేలు
కలిమి లేములు కావడి కుండలు
కలిసొచ్చే కాలానికి కుందేలు వంటింట్లోకి వస్తుంది
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు
కలుపు తీయని మడి – దేవుడు లేని గుడి
కలుపు తీయనివారికి కసువే మిగుల్తుంది
కల్యాణానికి ఒకరు వొస్తే కన్నం వేయటానికి ఇంకొకరొస్తారు
కళ్ళలో నీటిని తుడవగలంగానీ కడుపులో బాధ తుడవలేం
కళ్ళు ఆర్పే అమ్మ ఇళ్ళు ఆర్పుతుంది
కళ్ళు ఉంటేనే కాటుక
కళ్ళు కళ్ళు సై అంటే కౌగిళ్ళే మల్లెపందిరి అన్నట్లు
కళ్ళు కావాలంటాయి – కడుపు వద్దంటుంది
కళ్ళు నెత్తి కొచ్చినట్లు
కళ్ళు పెద్దవి – కడుపు చిన్నది
కళ్ళుపోయిన తర్వాత సూర్యనమస్కారాలు చేసినట్లు
కళ్ళెం – పళ్ళెం పెద్దవిగా ఉండాలి
కవికీ – కంసాలికీ సీసం తేలిక
కవితకు మెప్పు – కాంతకు కొప్పు అందం
కవ్వింతల అల్లరికి కౌగిలింతల ఖైదు
కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగలబెట్టినట్లు
కష్టపడి సుఖపడమన్నారు
కష్ట సంపాదన – యిష్ట భోజనం
కష్టాలు కలకాలం కాపురం ఉండవు
కష్టే ఫలి
కసిపోనమ్మ మసి పూసుకున్నదట
కాంతా కనకాలే కయ్యాలకి మూలాలు
కాకి అరిస్తే చుట్టాలు వస్తారు
కాకి అరిస్తే భయపడి పక్కింటాయన్ని కౌగలించుకున్నదట
కాకి గూటిలో కోయిల పిల్లలాగా
కాకిపిల్ల కాకికి ముద్దు
కాకి ముక్కుకు దొండపండు
కాకులను కొట్టి, గ్రద్దలకు వేసినట్లు
కాకుల మధ్య కోయిల లాగా
కాకై కలకాలం మన్నేకంటే – హంసై ఆరునెలలున్నా చాలు
కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
కాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలేదు
కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు
కాటికి పోయినా కాసు తప్పదు
కాటిదగ్గర మాటలు కూటి దగ్గర వుండవు
కాటుక కళ్ళ వాడూ – కళ్ళార్పు వాడూ కొంపలు ముంచుతారు
కాడిక్రిందకు వచ్చిన గొడ్డు – చేతికంది వచ్చిన బిడ్డ
కాడిని మోసేవాడికి తెలుస్తుంది బరువు
కాని కాలానికి కర్రే పామై కరుస్తుంది
కాని కూడు తిన్నా కడుపు నిండాలి
కాని పనికి కష్టం మొండు
కానీకి కొబ్బరికాయ యిస్తారని కాశీదాకా పోయినట్లు
కాకున్నది కాక మానదు
కాపు – కరణం ఏకమయితే నీళ్ళు కూడా దొరకవు
కాపుకు విశ్వాసం లేదు – కందికి చమురు లేదు
కాపు బీదైతే కళ్ళం బీద
కాపురం గుట్టు – రోగం రట్టు
కాపురం చేసే కళ కాలు త్రొక్కేవేళే తెలుస్తుంది
కాపుల కష్టం – భూపుల సంపద
కాపుల చదువులు కాసుల నష్టం – బాపల సేద్యం భత్యం నష్టం
కాపుల జాతకాలు కరణాల కెరుక
కామానికి సిగ్గూ లజ్జా లేవు
కామానికి కండ్లు లేవు
కామి గాక మోక్షగామి కాలేడు
కాముని పట్నంలో కౌగిలి కట్నాలన్నట్లు
కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది
కాయని కడుపూ – కాయని చెట్టూ
కాయలో పత్తి కాయలో ఉండగానే సోమన్నకు ఆరుమూరలు నాకు పదిమూరలు అన్నట్లు
కారణం లేకుండా కార్యం పుట్టదు
కారాని కాలానికి రారాని పాట్లు
కారుచిచ్చుకు గాలి తోడైనట్లు
కార్యం అయ్యేదాకా తలవంచుకుంటే, కలకాలం తలెత్తుకు తిరగవచ్చు
కార్తీక మాసాన కడవలు కడిగే పొద్దుండదు
కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదరినా చెడుతాయి
కాలం గడిచి పోతుంది – మాట నిలిచిపోతుంది
కాలం తప్పిననాడు పై బట్టే పామై కరుస్తుంది
కాలం వచ్చి చిక్కింది గానీ లేడికి కాళ్ళు లేక కాదు
కాలమొక్కరీతిగా గడిపిన వాడే గడిచి బ్రతికిన వాడు
కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు
కాలికి దూరమయితే కన్నుకు దూరమా?
కాలికి రాని చెప్పును కడగా వుంచమన్నారు
కాలికి వేస్తే మెడకు – మెడకు వేస్తే కాలికి
కాలికి బలపం కట్టుకు తిరిగినట్లు
కాలిది తీసి నెత్తికి రాచుకున్నట్లు
కాలు కాలిన పిల్లి వలె
కాలూ, చెయ్యి ఉన్నంతకాలం కాలం గడుస్తుంది
కాలు జారితే తీసుకోగలం – నోరు జారితే తీసుకోలేం
కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుగానీ కన్ను తడవకుండా జీవితం దాటలేం
కాలు త్రొక్కిన వేళ – కంకణం కట్టినవేళ
కాలు నొచ్చినా, కన్ను నొచ్చినా చేసేవాళ్ళు కావాలి
కాలే గుడిసెకు పీకే వాసమే లాభం
కావలసినవన్నీ తాకట్టు పెడతా స్వంతం చేసుకుంటావా అందిట
కాళ్ళ తంతే పెరిగేది పుచ్చకాయ – కుళ్ళేది గుమ్మడి కాయ
కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు
కాళిదాసు కవిత్వం కొంత – నా పైత్యం కొంత అన్నట్లు
కాశీకి పోయి కొంగ పియ్య తెచ్చినట్లు
కాశీకి పోయినవాడూ – కాటికి పోయినవాడూ ఒక్కటే
కాశీకి పోయినా కర్మ తప్పదు
కాషాయంపైన, కషాయంలోపల వుంటే ప్రయోజనం లేదు
కాసుకు కాలెత్తేదానికి కాశీ ఎందుకు?
కాసుకు గతి లేదు గానీ కోటికి కొంగు పట్టాడట
కాసులుగలమ్మ కట్టా విప్పా – వేషంకలమ్మ విడవా మడవా
కాసులు గలవాడే రాజు
కాస్త ఓడంటే అంతా ఓడినట్లు

కిందపడ్డా మీసాలకు మన్ను కాలేదన్నట్లు
కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లు
కింద పెట్టిన పంటలుండవు – పైన పెట్టిన వానలుండవు
కిష్కింధాపుర అగ్రహారీకులు లాగా
కీడెంచి మేలెంచవలె
కీలెరిగి వాత పెట్టాలి

కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడు
కుంటికులాసం ఇంటికి మోసం
కుంటి గాడిదకు జారిందే సాకు
కుంటివాడి తిప్పలు కుంటివాడివి – గూనివాడి తిప్పలు గూనివాడివి
కుంటి సాకులు – కొంటె మాటలు
కుంటి వాడయినా ఇంటి వాడే మేలు
కుండల దుమ్ము రోకళ్ళతో దులిపినట్లు
కుండ ఎప్పుడు వేరో కుదురూ అప్పుడే వేరు
కుండలు మూయను మూకుళ్ళున్నాయి కానీ – నోళ్ళను మూయ మూకుళ్ళు లేవు
కుండలు, చాటలు లేవని వండుకుతినటం మానుతామా?
కుండలో కూడు కుండలో వుండాలి – బిడ్డలు గుండ్రాయిల్లాగా వుండాలి
కుండల్లో గుర్రాలు తోలినట్లు
కుండ వేరయితే కులం వేరా?
కుందేటి కొమ్ము సాధించినట్లు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు
కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే
కుక్క తోక చక్కనౌతుందా?
కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు
కుక్కను తెచ్చి అందలంలో కూర్చోపెడితే కుచ్చులన్నీ తెగ కొరికిందట
కుక్కను ముద్దు చేస్తే మూతంతా నాకుతుంది
కుక్క బ్రతుకు – నక్క చావు
కుక్క బుద్ధి దాలిగుంటలో వున్నంతసేపే
కుక్క ముట్టిన కుండ
కుక్కలూ కుక్కలూ కాట్లాడుకుని కూటిలో దుమ్ము పోసుకుంటాయి
కుక్కలు చింపిన విస్తరిలాగా
కుక్క వస్తే రాయి దొరకదు – రాయి దొరికితే కుక్క రాదు
కుచేల సంతానంలాగా
కుట్టని రవిక చేతిలో వున్నా ఒకటే – ఏలని మొగుడు ఊరిలో వున్నా ఒకటే
కుట్టితే తేలు – కుట్టకుంటే కుమ్మరి పురుగు
కుట్టేవాడి కుడిచేతి క్రింద – చీదేవాడి ఎడమచేతి క్రింద ఉండరాదు
కుడికాలు పెడితే కుల క్షయం – ఎడమకాలు పెడితే వంశ క్షయం
కుడిచేత్తో యిచ్చి, ఎడమచేత్తో తీసుకున్నట్లు
కుడిచేత్తో చేసే దానం ఎడమచేయికి తెలియరాదు
కుడితిలో పడ్డ ఎలుకలాగా
కుడవబోతూ రుచు లడిగినట్లు
కుదువ సొమ్ముకు కొంత హాని
కుప్ప తగుల బెట్టి పేలాలు వేయించుకున్నట్లు
కుమ్మరి పురుగుకు మన్ను అంటుతుందా?
కుమ్మరి వీధిలో కుండలమ్మినట్లు
కుమ్మరాయిలో ఇత్తడి ముంతలు ఏరినట్లు
కుమ్మరి వారి కోడలు ఆము దగ్గరైనా కన్పించదా?
కుర్రవాడి గూర్చి అడగండిగానీ చెవుల కమ్మల విషయం మాత్రం అడగొద్దు అన్నట్లు
కులం కన్నా గుణం ప్రధానం
కులం కొద్దీ గుణం
కులం చెడ్డా గుణం దక్కవలె
కులమింటి కోతి అయినా మేలు
కులము చెరిచేవారే గానీ కూడు పెట్టే వారుండరు
కులము తక్కువ వాడు కూటికి ముందు
కుల మెరిగి కోడలిని – జాతి నెరిగి గొడ్డును తీసుకోవాలి
కులవిద్యకు సాటిలేదు గువ్వల చెన్నా
కులహీనమైనా వరహీనం కారాదు
కుళ్ళే వాళ్ళ ముందే కులకాలి
కుళ్ళే వాళ్ళ ముందే భగవంతుడు కులుకుతాడు
కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట
కూటికి గతి లేదు గానీ మీసాలకు సంపంగ నూనె
కూటికి తక్కువైతే కులానికి తక్కువా?
కూటికి పేదయినా చేతకు బీద కాదు
కూటికుంటే కోటికున్నట్లే
కూటి కోసం కోటి విద్యలు
కూటి పేద తోడు పోగొట్టుకుంటాడు
కూడబెట్టిన వాడు కుడవ నేర్చునా?
కూడు తిని కుల మెంచినట్లు
కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ
కూడు పెట్టినామెను తొడ పొందు అడిగినట్లు
కూడూ, గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా నన్నాడట
కూడే కూడే కాపురాన్ని కూలదొయ్యకపోతే నేను నీ రంకు మొగుణ్ణే కాదు అన్నాడుట
కూతురని కుంచడిస్తే, తల్లని కంచెడు యిచ్చిందట
కూతురి పురుడు యింట్లో – కోడలి పురుడు అడవిలో
కూతురు కనకపోతే అల్లుడిమీద పడి ఏడ్చినట్లు
కూతురు చెడితే తప్పు తల్లిది
కూన అని పెంచితే గండై కరవ వచ్చిందట
కూనలమ్మ సంగీతం వింటూంటే కూడు దొరికినట్లే!
కూపస్థ మండూకం లాగా
కూరకు తాలింపు – చీరకు ఝాడింపు
కూర లేని తిండి కుక్క తిండి
కూరిమిగల దినములలో నేరము లెన్నడును తోచవు
కూరిమి చెడితే అన్నీ దోషాలే
కూర్చుంటే కుక్క కఱవదు
కూర్చుంటే లేవలేడు గానీ, ఎగిరెగిరి తంతాడట
కూర్చున్నవానికి కుప్పలు – తిరిగేవానికి తిప్పలు
కూర్చుని తింటుంటే కొండలయినా కరిగిపోతాయి
కూర్చుని తింటుంటే గుళ్ళూ, గోపురాలూ ఆగవు
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు
కూలికి వచ్చి మానం దోచినట్లు
కూలివాడి ప్రొద్దా! కుంకవే ప్రొద్దా!
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెఱచినట్లు

కృత్తిక, పునర్వసులు సత్తువ పంట
కృత్తికలో కుతికె పిసుకుడు
కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు
కృష్ణా స్నానానికి కొండుభొట్లాజ్ఞా

కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే చలేమిటి?
కొంగులాగితే రానిది కన్ను గీటితే వస్తుందా?
కొంగ జపము చేపల కోసమే
కొంగు తాకితే కోటి వరహాలు
కొంగున నిప్పు మూట కట్టుకొన్నట్లు
కొంటే రానిదే కొసరితే వస్తుందా?
కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు
కొండంత చీకటి – గోరంత దీపం
కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?
కొండంత నిరాశ – గోరంత ఆశ
కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగలమా
కొండంత దేవుడికి గోరంత బెల్లం
కొండంత మొగుడే పోగా లేంది ఇవన్నీ యెందుకు అన్నదట
కొండంత రాగంతీసి గోరంత పదం చెప్పినట్లు
కొండ అద్దంలో కొంచెమే
కొండకు వెంట్రుక ముడివేసి లాగితే, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది
కొండగాలికి పైట జారితే, అందగాడి చూపుకి చీర జారిందట
కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట
కొండను తలతో ఢీకొన్నట్లు
కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
కొండలి మంగలి పనిలాగా
కొండలు మ్రింగేవాడికి గుడులొక లెక్కా
కొండ మీద గోలేమిటంటే కోమటాళ్ళ రహస్యాలన్నట్లు
కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాళ్ళు
కొండలు పిండి కొట్టినట్లు
కొండవీటి చేంతాడులాగా
కొండి మీటుడు – గోడ కెక్కుడు
కొంపకాలి ఏడుస్తుంటే నీళ్ళు కాచుకోనా అని అడిగినట్లు
కొక్కిరాయీ కొక్కిరాయీ ఎందుకు పుట్టావంటే చక్కని వాళ్ళను వెక్కిరించటానికి అన్నదట
కొట్టా వద్దు తిట్టా వద్దు వాడి చావు వాడే చస్తాడన్నట్లు
కొడితే కొట్టాడు కానీ క్రొత్తకోక పెట్టాడు
కొడుకు బాగుండాలి – కోడలు ముండమొయ్యాలన్నట్లు
కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?
కొడుకు ముద్దు – కోడలు మొద్దు
కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డదట
కొత్త ఒక వింత – పాత ఒక రోత
కొత్త ఆవకాయ – కొత్త పెళ్ళాం
కొత్త కాపురం, కొత్త కత్తిపీట కొత్తలో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయి
కొత్త కుండలో నీళ్ళు, కొత్త పెళ్ళాం బహు తీపి
కొత్తంత పండుగా లేదు – తల్లంత దయా లేదు
కొత్తది నేర్వలేడు – పాతది మరువలేడు
కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు
కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు
కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు
కొత్త సేద్యగాడు పొద్దెరుగడు
కొని తింటూంటే కోమటి నేస్తం
కొన్న దగ్గర కొసరుగానీ, కోరిన దగ్గర కొసరా?
కొన్నంగడిలోనే మారు బేరమా?
కొన్నది వంకాయ – కొసరింది గుమ్మడికాయ
కొన్నవాడు తినక మానడు
కొన్నాళ్ళు చీకటి – కొన్నాళ్ళు వెన్నెల
కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే
కొమ్ములు చూచి బేరమాడినట్లు
కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట
కొర్ర గింజంత కోడల్ని చూస్తే కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందట
కొరివితో తల గోక్కున్నట్లు
కొరివి పెట్టేవాడే కొడుకు
కొల్లేటి పంట కూటికే చాలదు
కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగ
కొసరితేగానీ రుచి రాదు
కొసరి భోజనం పెట్టావ్‌ -మరి ఆ ముచ్చట కూడా తీర్చమన్నాడట
కో అంటే కోటిమంది
కోక కేకేస్తే రవిక రంకేసిందిట
కోక ముడి విప్పుతూ వరసలడిగినట్లు
కోకా, రైకా కలవని చోట చూపి ఊరించినట్లు
కోటలో పాగా వేసినట్లు
కోటి విద్యలు కూటి కొరకే
కోడలా! కోడలా! నీ భోగమెంతసేపే అంటే మా అత్త మాలపల్లినుంచి తిరిగి వచ్చిందాకా అందిట
కోడలి కన్నీళ్ళు కనబడతాయిగానీ, అత్త పెట్టే పెట్టు కనబడదు
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు
కోడలికి బుద్ధి చెప్పి అత్త ఱంకు పోయిందట
కోడలు గృహ ప్రవేశం – అత్త అగ్ని ప్రవేశం
కోడలు నలుపైతే కులమంతా నలుపే
కోడలు వచ్చిన వేళ – గొడ్డు వచ్చిన వేళ
కోడికి కులాసా లేదు – కోమటికి విశ్వాసం లేదు
కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు
కోడి రెక్కారవేస్తే గొప్పవాన
కోడీ, కుంపటీ లేకపోతే తెల్లారదా?
కోతలకు ఉత్తర కుమారుడు
కోతికి అద్దం చూపినట్లు
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
కోతి చస్తే గోడవతల పారేసినట్లు
కోతికి తేలు కుట్టినట్లు
కోతికి పుండయితే గోకా, నాకా
కోతికి బెల్లం, కోమటికి ధనం చూపరాదు
కోతి చావు, కోమటి ఱంకు ఒక్కటే
కోతి పంచాయితీ కొంప తీస్తుంది
కోతి పుండు బ్రహ్మరాక్షసి
కోతి రూపుకు గీత చక్కన – పాత గోడకు పూత చక్కన
కోపం గొప్పకు ముప్పు – హంగు అల్లరికి ముప్పు
కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు
కోమటి యిల్లు కూలినట్లు
కోమటికులం పైసాకు తులం
కోమటికీ కోతికీ ముల్లె చూపరాదు
కోమటితో మాట – కోతితో సయ్యాట ప్రమాదాలు
కోమటికి లేమి – కంసాలికి కలిమి వుండదు
కోమటి సాక్ష్యం – బాపన వ్యవసాయం
కోమట్ల కొట్లాట – గోచీ వూగులాట
కోమలి తనువే కాముని ధనువు
కోమలాంగి సోకు కోనసీమ కొబ్బరి లాంటిదిట
కోరి అడిగితే కొమ్మెక్కుతారు
కోరి నెత్తికెత్తుకున్న దేవర దయ్యమై పట్టుకున్నట్టు
కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు
కోరుకున్న కోడలు వస్తే, నెత్తిమీద నిప్పులు పోస్తుంది
కోర్టులో గెలిచినవాడు యింట్లో ఏడిస్తే, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు
కోర్టు కెక్కినవాడూ, గాడిద నెక్కినవాడూ ఒక్కటే

కౌగిలించి చేసుకునేవే ప్రేమ వందనాలు
కౌగిట్లో పరువాలు పడతియిచ్చే నజరానాలు
కౌగిలింతకన్న సుఖం లేదు – కాపురమంత మజా లేదు
కౌగిలింతలకే కన్నె తాపాలు (చెల్లు) అన్నట్లు
కౌగిలింతల బిగువెంతంటే నచ్చినవాడి శక్తంత అందిట
కౌగిలిహోరూ మల్లెలజోరూ తప్పితే కడుపుపండే మాటేమైనా వుందా? అందిట
కౌగిళ్ళ కట్నాలే సొగసులకు నజరానాలన్నట్లు
కౌగిళ్ళ గుసగుసలు కాముని దరహాసాలన్నట్లు
కౌగిళ్ళ పందిట్లో పూలంగి సేవలన్నట్లు
కౌగిళ్ళ బంధాలేసి బుగ్గల్లో మందారాలు పూయిస్తే అందాల గంధాలు పూస్తా అందిట
కౌగిళ్ళ స్వర్గాలు కాముని రాజమార్గాలు అన్నట్లు

అక్షరంతో-

ఖొజ్జా మొగుడు పక్కలో వున్నా ఒక్కటే వీధిలో వున్నా ఒక్కటే

Leave a Reply