మన తెలుగు సామెతలు (‘హ – క్ష ’ అక్షరములతో)

Share Icons:

హంగామాల పెళ్ళాం – ఆర్భాటాల మొగుడు
హంస నడకలు రాకపోయే – ఉన్న నడకలు మరిచిపోయే
హద్దుల్లో వుంటేనే ముద్దూ ముచ్చటా
హద్దుల్లో వుంటేనే ఆడది – హద్దు దాటితే గాడిద
హనుమంతుని ముందు కుప్పిగంతులా?
హరిదాసుకందరూ తనవారే
హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు – నా నోట నిజం రాదు
హరిశ్చంద్రునికి వారసుడన్నట్లు
హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన
హస్తకు ఆదిపంట – చిత్తకు చివరి పంట
హస్తకు ఆరుపాళ్ళు – చిత్తకు మూడుపాళ్ళు
హస్త, చిత్తలు వరుపయితే అందరి సేద్యం ఒక్కటే
హస్తలో అడ్డెడు చల్లేకంటే చిత్తలో చిటికెడు చల్లటం మేలు
హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు
హస్తలో చల్లితే హస్తంలోకి రావు
హాజరు జవాబు – అదే పోతే
హాస్యగానికి తేలు కుట్టినట్లు
హీనకాంతి దీపం యింటికి చేటు – మొగమాటపు పెళ్ళాం మొగుడికి చేటు
హేతువు లేకుండా తీతువు కూయదు
హేమా హేమీల్లాగా
హేమా హేమీలు ఏట్లో కొట్టుకుపోతుంటే, నక్క పాటిరేవడిగిందట

క్ష అక్షరంతో-

క్షణం చిత్తం – క్షణం మాయ
క్షవర కళ్యాణంలాగా
క్షణం తీరిక లేదు – దమ్మిడీ ఆదా లేదు
క్షామానికి జొన్న – వర్షానికి వరి పండుతాయి
క్షేత్రమెరిగి విత్తనం వేయాలి
క్షేమంగా పోయి లాభంగా రా!
క్షేమం కోరితే క్షామం లేదు
క్షేమ సమాచారాలడిగినట్లు

 

Leave a Reply