మన తెలుగు సామెతలు (‘ష – స ’ అక్షరములతో)

Share Icons:

షండుడికి రంభ దొరికితే ఏమవుతుంది?

షష్ఠిపూర్తినాడు పక్కింటావిడకి కన్నుకొట్టినట్లు

షష్టినాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు

 

అక్షరంతో-

సంకటకాలే వేంకటరమణ అన్నట్లు
సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి
సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోనివారూ బయటకు వస్తారు
సంక్రాంతి సాలు కొకసారే
సంగీతము చేత బేర సారము లుడిగెన్‌
సంఘ భయం – పాప భయం
సంజయ రాయబారంలాగా
సంచిలాభం చిల్లు కూడదీసింది
సంతకు వెళ్ళొచ్చిన ముఖంలాగా
సంత మెరుగు సాని ఎరుగును
సంతలో కొడితే సాక్షులెవరు?
సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం చేస్తే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడిపోయిందట
సంతోషం సగం బలం
సంతోషానికి సాకు – ఆలోచనకు ఆకృతి లేదు
సందడిలో సడేమియా అన్నట్లు
సందడిలో సందడి – పనిలో పని
సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు
సందేహాలన్నీ దేహాలతో తీర్చుకున్నట్లు
సంపదలో మరుపులు – ఆపదలో అరుపులు
సంపదలో మరుపులు – ఆపదలో మ్రొక్కులు
సంపద, సాని రెండూ నిలకడగా వుండవు
సంపెంగల సంతలో ఒయ్యారాల విందులన్నట్లు
సంపాదన ఒకరిది – అనుభవం ఇంకొకరిది
సంసారం గుట్టు – జబ్బు రట్టు
సంసారం జానెడు – ఖర్చు బారెడు
సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే బూడిద, బుర్రకాయ గాడిద బరువైనాయట
సంసారి తిరిగి, సన్యాసి తిరగక చెడతారు
సంసారి సైయ్‌ఁ – సన్యాసి సైయ్‌ఁ అన్నాడట ఆకలితో చచ్చే సన్యాసి
సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టు
సకల గుణాభిరాముడు
సకల శాస్త్రాలు – నిలబడి మూత్రాలూ
సగం పెట్టి మేనత్త అన్నట్లు
సగం సాలె నేత, సగం మాలనేత
సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతూంటే, అసత్యం ప్రపంచమంతా చుట్టి వస్తుంది
సత్యం నావద్ద దండిగా వుంది, చెప్పులు తేరా మగడా! నిప్పులో దూకుతా అందట
సత్రం కూటికి అయ్యగారి ఆజ్ఞా!
సత్రం భోజనం – మఠం నిద్ర
సన్నమో ముతకో సంతలో తేలిపోతుంది
సన్నసన్నగా కాపుతనం వచ్చింది – సన్న బియ్యం వండవే పెళ్ళామా అన్నాట్ట
సన్నెకల్లు దాస్తే పెళ్ళాగుతుందా?
సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు తప్పలేదు
సన్యాసికి దొంగల భయమేమి?
సన్యాసి పెళ్ళాం విధవా కాదు పునిస్త్రీ కాదు
సన్యాసి పెళ్ళికి జుట్టునుంచీ అరువే
సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుంది
సన్యాసుల మధ్య కల్లుముంతలు మాయమైనట్లు
సభా పిరికిదానా! ఇంటిలో లేడని చెప్పవే అని అన్నాడట
సమయం తప్పితే కాళ్ళు – సమయం వస్తే రాళ్ళు
సమయానికి రానిది చంక నాకనా?
సముద్రం మధ్యన వున్నా మంచినీళ్ళు కరువే
సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరు
సముద్రంలో కాకి రెట్టలాగా
సముద్రంలో నీటి బొట్టులాగా
సముద్రంలో వానపడినట్లు
సముద్రానికి ఏతాము వేసినట్లు
సరదాకి సమర్తాడితే చాకలిది చీర, రవిక లాక్కున్నదట
సరసము విరసము కొరకే
సరసానికి వస్తావా సొగసుల మధురిమ చూపిస్తా అందిట
సరసానికి రారా మగడా అంటే మూడంకె వేస్తాడన్నట్లు
సరసానికైనా సమయం వుండాలి
సరాగాలకు సై అంటే తీగలా నన్ను చుట్టుకుని అందాలన్నిటినీ ఆరేసుకుంటా అందిట
సరిపడనివారు చచ్చినవారితో సమానం
సర్వేజనా స్సుఖినో భవన్తు
సవతులున్న ఇల్లు నరక సమానం
సవాశేరులో బోడి పరాచకమా?
సర్కారుకు చాటుగానూ, షావుకారికి ఎదురుగానూ వుండాలి
సహనం కంటే సముద్రం చిన్నది
సహనం ముందు లోకం గుప్పెడే
సహనం కలవాడికి ఎదురే లేదు
సహనముంటే పశ్చాత్తాపానికి చోటేలేదు
సాగితే రంకు – సాగకపోతే బొంకు
సాగితే సాగించుకోమన్నారు
సాగినమ్మ చాకలాడితో పోతే అదొక వ్రతమనుకొన్నారట
సాతాని జుట్టుకు, సన్నాసి పిలక్కు ముడివేసినట్లు
సాతాని పీకులాటలాగా
సానికి రంకులు నేర్పాలా?
సాని నీతి, సన్యాసి జాతి తెలియవు
సాము నేర్చినవానికే చావు గండం
సామెతలేని మాట – ఆమెత లేని ఇల్లు
సామెతల మాట – విందు వినోదాల పొందు
సాయిబు గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్ట అంటించుకోను నిప్పు అడిగినట్లు
సాయిబు సంపాదన బూబు కుట్టుకూలికే సరి
సాలెవాడి భార్య సరి మీద పడింది
సాలెవాని ఎంగిలి ముప్పై కోట్ల దేవతలు మెచ్చారు
సాలెవానికీ కోతిపిల్లకూ తగులాటమైనట్లు
సాక్షికాళ్ళు పట్టుకోవడంకన్నా వాదికాళ్ళు పట్టుకోవడం మేలు
సింగారం చూడరా నా బంగారు మగడా అన్నట్లు
సిగ్గు చాటెడు – చెప్పులు మూటెడు
సిగ్గు చెడ్డా ఫలితం దక్కాలి
సిగ్గు మొగ్గ వేస్తే శృంగారం – మొగ్గ సిగ్గు విడిస్తే మందారం అన్నట్లు
సిగ్గు సుకుమారమైంది
సిగ్గుల పరిధికి అంతం – అందాల రక్తికి ఆరంభం పడకటింటిపడకే అన్నట్లు
సిగ్గులేని ముఖానికి చిరునవ్వే అలంకారం
సిగ్గు విడిస్తే చింతెందుకు?
సిగ్గు విడిస్తే శ్రీరంగం అన్నట్లు
సిగ్గే స్త్రీకి అలంకారం
సిరికొద్దీ చిన్నెలు – మగనికొద్దీ వన్నెలు
సిరిపోయినా చిన్నెలు పోలేదు
సిరిమల్లె పూలెట్టి గదిలో కొస్తే సిగ్గెంతో కొలవాల్సిందే అన్నాడట
సిరిరా మోకాలొడ్డు వారుంటారా?
సీత పుట్టుక లంకకు చేటు
సీతాపతీ! నీకు చాపేగతి
సుందరాంగి చూపుకన్నా సోకు లేదన్నట్లు
సుఖం మరిగినమ్మకు మొగుడి కష్టమేం తెలుస్తుంది?
సుఖం మరిగిన దాసరి పదం మరిచాడట
సుతారం – సువ్వారం బొగ్గులు గానూ
సుతులు లేనివారికి గతులు లేవు
సున్నం కొడితేగానీ శుద్ధిగాదు
సున్నకి సున్న – హళ్ళికి హళ్ళి
సుపుత్రా కొంప పీకరా!
సుబ్బలక్ష్మి మొగుడు సుందరాంగుడు – అమ్మణ్ణి మొగుడు అనాకారుడు అన్నట్లు
సూడిద బూడిదపాలు – ఇల్లాలు యితరుల పాలు
సూదిని తీసుకెళ్ళి దూలానికి గ్రుచ్చినట్లు
సూది పోయిందని సోదెకు వెడితే పాతరంకులు బయట పడ్డాయట
సూది గొంతు – బాన కడుపు
సూదిలా వచ్చి పలుగులా తయారైనట్లు
సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖానే పడుతుంది
సూర్యుని ముందు దివిటీలాగా
సూక్ష్మంలో మోక్షం అన్నట్లు
సృష్టి రహస్యం శోభనం గదిలో తెలిసినట్లు
సెగ లేనిదే పొగరాదు
సెట్టిగారి బ్రతుకు చచ్చిన తరువాత తెలుస్తుంది
సెట్టి వీసెడు – లింగం మణుగు
సేవలు పూజ్యం – మాటలు బహుళం
సైంధవుడిలాగా అడ్డుపడినట్లు
సొంతానికి ఏనుగు – ఉమ్మడికి పీనుగు
సొగసుల తాయిలం పెదాలతో అందించినట్లు
సొగసుల నైవేద్యం – పెదవుల తాంబూలం
సొమ్ము పోయేటప్పుడు, దెబ్బ తగిలినప్పుడూ మతి ఉండదు
సొమ్మొక చోట – అనుమాన మొకచోట
సొమ్మొకడిది – సోకొకడిది
సొమ్ము సొమ్ముగా వుండాలి – బిడ్డలు గుండ్రాళ్ళలాగా వుండాలి
సొమ్మేమి సాక్ష్యం – మనిషేమి పావనం?
సోకుమొక్కు సందకాడ తీర్చమన్నట్లు
సోమరి సమాజానికి బరువు
సోమరికి షోకులెక్కువ
సోయగాల విందుకు వేళాపాళాలేదు రమ్మందట
సౌందర్యం నశ్వరం – సౌశీల్యం శాశ్వతం
స్త్రీ చిత్తం – పురుషుడి భాగ్యం
స్థాన బలిమి కాని తన బలిమి కాదు
స్నానానికి ముందుండకూడదు, సంభావనకు వెనకుండకూడదు
స్వకార్య ధురంధరుడు – స్వామికార్య వంచకుడు
స్వకుచ మర్దనం
స్వగృహే పూర్ణమాచారం
స్వయంరాజా – స్వయం మంత్రీ
స్వర్గానికి పోయినా సవతి పోరు తప్పలేదన్నట్లు
స్వర్గారోహణపర్వం చదువుతున్నట్లు
స్వాతి కురిస్తే చట్రాయికూడా పండుతుంది
స్వాతి కురిస్తే భీతి
స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి
స్వాతివాన ముత్యపువాన
స్వాతివానకు సముద్రాలు నిండుతాయి
స్వాతీ నేను జరుపుకు వస్తాను, విశాఖా నీవు విసురుకురా!
స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు

Leave a Reply