మన తెలుగు సామెతలు (‘శ ’ అక్షరంతో)

Share Icons:

శంఖులో పోస్తేగానీ తీర్థం కాదు
శృంగారమంటే ఏ తీరో – ఏ విధమో చెప్పరా నా ముద్దుల ప్రియుడా అన్నదట
శృంగారానికి సమయం – సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లు
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు
శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు
శతమర్కటం పితలాటకం అన్నట్లు
శతాపరాధములకు సహస్ర దండనలు
శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు
శనిపడితే ఏడేళ్ళు – నేను పడితే పధ్నాలుగేళ్ళు
శనిపీనుగు ఒంటరిగా పోదు
శని విరగడయితే చాలు అన్నట్లు
శనేశ్వరానికి నిద్రెక్కువ – దరిద్రానికి ఆకలెక్కువ
శల్యపరీక్ష చేసినట్లు
శల్య సారథ్యం లాగా
శవానికి చేసిన అలంకారం వలె
శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు
శాస్త్రులవారింట పుట్టాను, సోమయాజుల వారింట మెట్టాను,
లవణమంటే దూడ రేణమని తెలీదా నాకు అన్నదట
శివరాత్రికి చింతాకంత చెమట
శివరాత్రికి శివ లింగాలంత మామిడికాయలు
శివరాత్రితో చలి శివ శివా అంటుంది
శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు
శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానం
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండెక్కడన్నాడట
శుభస్య శీఘ్రం
శుష్క ప్రియాలు – శూన్య హస్తాలు
శూద్ర సంతర్పణ – బ్రాహ్మణ సేద్యం
శృంగారానికి సమయ సందర్భాలు అక్కరలేదన్నట్లు
శృంగారానికి సిగ్గూ – ముద్దుకు బుద్ధీ లేవన్నట్లు
శేరుకు సవాశేరు
శొంఠిలేని కషాయం ఉంటుందా?
శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లు
శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పు
శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లు
శోభనాల వేళ – సురాలోక మార్గం అన్నట్లు
శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లు
శ్మశాన వైరాగ్యం – ప్రసూతి వైరాగ్యం
శ్రాద్ధాని కంటులేదు – యజ్ఞానికి ఎంగిలిలేదు
శ్రావణంలో శనగల జోరు – భాద్రపదంలో బాధల పోరు
శ్రీరంగనీతులు చెపుతాం ఆచరించండి అన్నట్లు
శ్రీరామరక్ష నూరేళ్ళాయుష్షు
శ్రీరామరక్ష – సర్వ జగద్రక్ష
శ్రుతిమించి రాగాన పడినట్లు
శ్వాస వుండే వరకూ ఆశ ఉంటుంది

 

Leave a Reply