మన తెలుగు సామెతలు (‘త – థ’ అక్షరములతో)

Share Icons:

తంగేడు పూచినట్లు
తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది
తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది
తండ్రి వంకవారు దాయాదివారు
తంతే బూరెల గంపలో పడ్డట్లు
తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?
తక్కువ వానికి నిక్కులు లావు
తగవు తీర్చరా సింగన్నా అంటే దూడ, బర్రె నావే అన్నాట్ట
తగినట్టు కూర్చాడురా తాకట్లమారి బ్రహ్మ అన్నట్లు
తగిలించుకొనటం తేలిక – వదిలించుకోవటం కష్టం
తగిలిన కాలుకే తగులుతుంది
తగులమారి తంపి – పుల్లింగాల పిల్లి
తగులుకున్న మొగుడినీ, తాడిచెట్టు నీడనూ నమ్ముకోరాదు
తట్టలో కాపురం బుట్టలోకి వచ్చినట్లు
తణుకు పోయి మాచారం పోయినట్లు
తడి గుడ్డతో గొంతు కోసినట్లు
తడిక కుక్కకు అడ్డంగానీ, మనిషికి అడ్డమా?
తడిక తోసిన వాడిది తప్పు అన్నట్లు
తడిసి గానీ గుడిసె కప్పడు
తడిసిన వానికి చలేమిటి?
తడిసి ముప్పందుము మోసినట్లు
తద్దినం పెట్టేవానికి తమ్ముడేగా!
తద్దినపు భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట
తద్దినానికి తక్కువ – మాసికానికి ఎక్కువ
తన యింటితలుపు ఎదురింటికిపెట్టి, తెల్లవార్లూ తనింట్లో కుక్కలు తోలుతూ కూర్చున్నట్లు
తన కంట్లో దూలాలు పెట్టుకుని, పరుల కంట్లో నలుసులు ఎంచినట్లు
తన కంపు తన కింపు
తన కడుపు పండితే పక్కింటాయన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందిట
తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోకదారిద్ర్యం అనుకున్నట్లు
తన కాళ్ళకు తానే మొక్కుకున్నట్లు
తనకు కానిది ఎట్లా పోతేనేం?
తనకు కాని రాజ్యం పండితేనేం? పండక పోతేనేం?
తనకు మాలినధర్మము – మొదలు చెడ్డ బేరము లేవు
తనకు రొట్టె – యితరులకు ముక్క
తనకు లేదనేడిస్తే ఒకకన్ను పోయింది – ఎదుటివానికున్నదని ఏడిస్తే యింకోకన్ను పోయింది
తన కోపమే తన శత్రువు
తన గుణం మంచిదయితే, సానివాడలో కూడా కాపురం చేయవచ్చు
తన చావు జగత్ప్రళయం అనుకున్నట్లు
తన ముడ్డి కాకుంటే కాశీదాకా దేకమన్నట్లు
తన తప్పు తప్పు కాదు – తన బిడ్డ దుడుకూ కాదు
తనదాకా వస్తేగానీ తెలియదు
తనది తాటాకు – యితరులది ఈతాకు
తన నీడని తానే త్రొక్కుకున్నట్లు
తన నోటికి తవుడు లేదు – లంజ నోటికి పంచదారట
తన ముడ్డి కాకపోతే తాటి మట్టకి ఎదురు దేకమన్నట్లు
తనయుల పుట్టుక తల్లి కెరుక
తనవారి కెంత వున్నా తన భాగ్యమే తనది
తన సొమ్ము అల్లం – పరుల సొమ్ము బెల్లం
తనువుకు తనువే అర్పణం అన్నట్లు
తనువుల తహతహ తీరేది కాదన్నట్లు
తనువుల దాహాలు పెదవులకే తెలుసునన్నట్లు
తనువుల పాలపుంత సొగసుల తాంబూలం అన్నట్లు
తనువుల యుద్ధం తనివి తీరదు
తనువులు దగ్గరైతే పరువాల పోరు తగ్గుతుందన్నట్లు
తనువు వెళ్ళినా దినము వెళ్ళదు
తన్నే కాలికి రోలు అడ్డమా?
తప్పు చేసినవానికీ – అప్పుచేసిన వానికీ ముఖం చెల్లవు
తప్పులు చేయనివారు అవనిలో లేరు
తప్పు లెన్ను వారు తండోపతండాలు
తప్పు, ఒప్పు దైవ మెరుగును
తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగును
తమలపాకులో సున్నమంతటివాడు – తక్కువయినా ఒకటే ఎక్కువయినా ఒకటే
తమలపాకుతో తానిట్లంటే, తలుపుచెక్కతో నేనిట్లంటి
తమాం లేదంటే రవికైనా తప్పించమన్నాడట
తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి
తరతరాల ఆస్తే నిలిచివున్న ప్రశస్తి అన్నట్లు
తలకడిగి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు
తల క్రింద కొరివిలాగా
తల కోసి మొలేసినట్లు
తలగడ క్రింద త్రాచుపామువలె
తల గొరిగించుకొన్నాక తిథి, వార,నక్షత్రాలు చూచినట్లు
తలచినప్పుడే తాత పెళ్ళి
తల చుట్టం, తోక పగ
తలచుకొన్నప్పుడే తలంబ్రాలంటే ఎలా?
తల ప్రాణం తోకకు వచ్చినట్లు
తలంబ్రాలకూ, తద్దినాలకూ ఒకే మంత్రమా?
తలమాసిన వాడెవడంటే ఆలి చచ్చినవాడే అన్నట్లు
తలలు బోడులయినా తలపులు బోడులా?
తలలో నాలుకలాగా
తలవ్రాత తప్పించుకోలేనిది
తల్లి కడుపు చూస్తే పెళ్ళాం జేబు చూస్తుంది
తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట
తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్పేవాడా?
తల్లికి తగిన బిడ్డ
తల్లిగలప్పుడే పుట్టిల్లు – పాలుగలప్పుడే పాయసం
తల్లి గుణం కూతురే బయట పెడుతుంది
తల్లి చచ్చినా మేనమాముంటే చాలు
తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానం
తల్లి చస్తే నాలుక చచ్చినట్లు – తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
తల్లి చాటు పిల్ల
తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?
తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే – పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు
తల్లిదే వలపక్షం – ధరణిదే వలపక్షం
తల్లినన్నా చూపెట్టు – తద్దినమన్నా పెట్టు
తల్లి దైవము – తండ్రి ధనం
తల్లిని చూచి పిల్లను – తరిని చూచి బర్రెను ఎంచుకోవాలి
తల్లిని నమ్మినవాడూ, ధరణిని నమ్మిన వాడూ చెడడు
తల్లి పిత్తి పిల్ల మీద పెట్టినట్లు
తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్లు
తల్లి పెంచాలి – ధరణి పెంచాలి – అంతేగానీ బయటివారు పెంచుతారా?
తల్లి మాటలు – పినతల్లి పెట్టు
తల్లి ముక్కు కోసిన వానికి మేనత్త ముక్కు బెండపువ్వు
తల్లి ముఖం చూడని బిడ్డ – వాన ముఖం చూడని పైరు
తల్లి లేని పిల్ల – ఉల్లిలేని కూర
తల్లి లేని పిల్ల దయ్యాల పాలు
తల్లి వంకవారు తగినవారు
తల్లి విషం – పెళ్ళాం బెల్లం
తవ్వగా తవ్వగా నిజం తేలుతుంది
తవ్వి మీద పోసుకున్నట్లు
తవ్వినా దొరకనిది మొత్తుకుంటే దొరుకుతుందా?
తాకబోతే తగులు కున్నట్లు
తాగను గంజి లేదు – తలకు సంపంగి నూనెట
తాగనేరని పిల్లి ఒలక పోసుకున్నదట
తాగపోతే నీరు లేదుగానీ ఈద పోయినట్లు
తాగినవాడి తప్పుకు తగవు లేదు
తాగిన వాడిదే పాట – సాగిన వాడిదే ఆట
తాగిన రొమ్మే గుద్దినట్లు
తాగేవాడే తాళ్ళ పన్ను కడతాడు
తాచుపోతు తామసం – జర్రిగొడ్డు పిరికితనం
తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిట
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?
తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారు
తాటి చెట్టుకి తేనె పట్టుపడితే ఈతచెట్టుకు ఈగలు ముసిరాయట
తాటిచెట్టు నీడ గాదు తగులుకున్నది పెండ్లామూ గాదు
తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటాడు
తాడు తెగిన గాలిపటంలా
తాడూ లేదు – బొంగరం లేదు
తాతకు దగ్గులు నేర్పినట్లు
తాత తిన్న బొచ్చె తరతరాలు
తాతలనాడు నేతులు తాగాం, మా మూతులు వాసన చూడండి
తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు
తాను తిన తవుడు లేదు – వుంచుకున్న దానికి వడియాలు
తాను దూర సందులేదు – మెడకో డోలు
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు
తాను మింగేదాన్నీ – తనను మింగేదాన్నీ చూచుకోవాలి
తాను మెచ్చ తినాలి – పరుల మెచ్చ నడవాలి
తాను తుమ్మి తానే శతాయుశ్షు అనుకున్నట్లు
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు
తాపుల గొడ్డుకు రోలడ్డమా?
తామరాకుపై నీటి బొట్టు లాగా
తాయెత్తులకే పిల్లలు పుడితే మొగుడెందుకన్నట్లు
తా వలచింది రంభ – తా మునిగింది గంగ
తాళ్ళపాక వారి కవిత్వం కొంత – నా పైత్యం కొంత
తింటే అయాసం – తినకుంటే నీరసం
తింటే కదలలేను – తినకపోతే మెదలలేను
తింటేగానీ రుచి తెలీదు – దిగితేగానీ లోతు తెలీదు
తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి
తిండికి ఏనుగు – పనికి పీనుగు
తిండికి చేటు – మందికి బరువు
తిండికి తిమ్మరాజు – పనికి పోతరాజు
తిండికి ముందు – పనికి వెనుక
తిండికి మెండు – పనికి దొంగ
తిండికి వచ్చినట్టా – తీర్ధానికి వచ్చినట్టా?
తిండి కొద్దీ పసరం
తిండెక్కువైతే తీపరం పెరుగుతుంది
తిక్కల వాడు తిరునాళ్ళకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందిట
తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం అన్నట్లు
తిట్టబోతే అక్కబిడ్డ – కొట్టబోతే బాలింత అన్నట్లు
తిట్టితే చచ్చేవాడూ – దీవించితే బ్రతికేవాడూ లేడు
తిట్టితే గాలికి పోతాయి
తిట్టిన వాడికి తిట్టున్నర అన్నట్లు
తిట్టుకు సింగారం లేదు
తిట్టే నోరు, తినే నోరు, తిరిగే కాలూ వూరుకోవు
తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది
తినగా తినగా గారెలు చేదు
తినబోతూ రుచులడిగినట్లు
తిననేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది
తినమరిగిన కుక్క అలమరిగిందట
తినమరిగిన కోడి యిల్లెక్కి కూసింది
తినమరిగిన ప్రాణం అల్లాడిపోతుంది
తిని వుండలేక, తాగి బొందలో పడినట్లు
తిని కక్కరాదు – కని పోగొట్టుకోరాదు
తినే తినే కూడులో మన్ను పోసుకున్నట్లు
తినేది గొడ్డు మాంసం పైగా విభూతి రేఖలు
తిన్న యింటి వాసాలు లెక్కపెట్టినట్లు
తిన్నదాని కంటే అరిగిందే బలం
తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పేరు నీకెలా తెలిసిందని అడిగితే
నీ ముఖం చూడగానే తెలిసిందని అన్నాడట
తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు
తియ్యని ముద్దులకు మురవాలో, అదిరే దెబ్బలకు అరవాలో తెలియటం లేదన్నదట
తియ్యని రోగాలు – కమ్మని మందులు
తిరుగానాం మరగానాం తీపి వాయనం అన్నట్లు
తిరిగి రైతు – తిరక్క బైరాగి చెడతారు
తిరిగే కాలూ, తిట్టే నోరు వూరుకోవు
తిరుపతి క్షవరంలాగా
తిలా పాపం తలా కొంచెం
తీగ కదిలిస్తే డొంకంతా కదుల్తుంది
తీగకు కాయ బరువా?
తీట గలవానికి తోట గలవానికి తీరికుండదు
తీట బట్టి వాడే గోక్కుంటాడు
తీట సిగ్గెరగదు
తీతువ పిట్టలాగా
తీపి ఏదంటే ప్రాణం అన్నట్లు
తీయగా తీయగా రాగం – మూలగ్గా మూలగ్గా రోగం
తీర్థము, స్వార్థము కలిసి వచ్చినట్లు
తీరు తీరు గుడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే, ఊరికొక గుడ్డ వూడిపోయిందట
తీర్చే వారుంటే ఎన్ని బెట్టులైనా పోవచ్చు
తీసినవాడూ బాగానే వుంటాడు – చూచినవాడూ బాగానే వుంటాడు ఎదుటివాని మీద పడుతుంది ముట్టుపుల్ల
తుట్టె పురుగుకు రెక్కలొచ్చినా, ముసలాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గా లుండవు
తుప్పరల పసే గానీ మంత్రాల పస లేదు
తుమ్మ తోపుల్లో కొత్త కోలాటం
తుమ్మల్లో ప్రొద్దుకూకినట్లు
తుమ్మ దుడ్డు వలె – కాపు కదురు వలె
తుమ్మితే వూడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది
తుమ్ముకు తమ్ముడు లేడు గానీ ఆవలింతకు అన్న వున్నాడు
తుమ్ము తమ్ముడై చెపుతుంది
తుమ్మెదలాడితే వాన తప్పదు
తురకలలో మంచివాడెవరంటే తల్లిగర్భాన వున్నవాడు, పుడమిగర్భాన ఉన్నవాడు
తురక లేని వూళ్ళో దూదేకులవాడే ముల్లా
తురకవాడికి గంగిరెద్దు పోతే కోసుకుని తిన్నారట
తులము నాలుకకు తొంభై రుచులు
తులలో వానకు ధరణి పండును
తులసి కోటలో దురదగొండి మొలచినట్లు
తులసివనంలో గంజాయి మొక్కలాగా
తులవ నోటికి ఉలవపప్పు
తూనీగలాడితే తూమెడు వర్షం
తూర్పున ఇంద్ర ధనుస్సు – దూరాన వర్షం
తూర్పున ఇంద్ర ధనుస్సుకు దుక్కిటెద్దు రంకె వేస్తుంది
తెంపుల నీళ్ళు – చిల్లులు కడవ
తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట
తెగించినవాడికి తెడ్డే లింగం
తెగితే లింగడు రాయి
తెగిన వేలుమీద ఉచ్చకూడ పోయడు
తెగువ దేవేంద్ర పదవి
తెగేదాకా లాగరాదు
తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు
తెడ్డుకేమి తెలుసు వంట రుచి?
తెలఘాణ్యపు టెక్కు – నియోగపు నిక్కు
తెలియని దయ్యంకన్నా తెల్సిన దయ్యం మేలు
తెలివి ఒకరి సొత్తా!
తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట వుంది
తెలివి తక్కువ – ఆకలెక్కువ
తెలివైనవాడికి చిటికెల సంకేతం చాలు
తెలిసే వరకే బ్రహ్మ విద్య – తెలిసిన తర్వాత కూసు విద్య
తెల్లనివన్నీ పాలు -నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లు
తెల్లవారితే ఎల్లవారల బ్రతుకులూ ఒక్కటే
తెల్లవారితే చూడు ఎల్లాయి బ్రతుకు
తేనెటీగల పని తీరుబడి లేని పని
తేనె పోసి పెంచినా వేపకు చేదు పోదు
తేరగా వచ్చింది తెగ తిన్నట్లు
తేరగా వచ్చింది వూరికే పోతుంది
తేర గుర్రం – తంగేడు బరిక
తేలు కుట్టిన దొంగలాగా
తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ తెగ కుట్టిందట
తేలు తేలండీ! అంటూ అరిస్తే మొగాళ్ళను పిలవ్వే అన్నాట్ట,
మీరు మొగాళ్ళు కారా అని భార్యంటే సమయానికి గుర్తు చేసావు కర్రతే అన్నాట్ట
తేలు మాదిరి కుట్టటం – బల్లి మాదిరి అణగటం
తేలువలె కుట్టినట్లు
తేలేనయ్యకు తిండి మెండు – వండలేనమ్మకు వగలు మెండు
తొండ ముదిరితే ఊసరవెల్లి
తొందరకు ఆలస్యం తోడు
తొందరగా రమ్మంటే, తిరగమూత వేసి వస్తానన్నట్లు
తొడ సంబంధం తొంభై ఏళ్ళుంటుంది
తొత్తు క్రింద బడి తొత్తులాగా
తొత్తులాగా పనిచేసి దొరలాగా అనుభవించాలి
తొలకరి జల్లులు – ఆశల మొలకలు
తొలకరిలో చెరువు నిండినా – తొలిచూలు కొడుకు పుట్టినా లాభం
తొలకరి వాన మొలకలకు తల్లి
తొలి ఏకాదశికి తొలి తాటిపండు
తోక తెగిన నక్కలాగా
తోకతో నారాయణా అన్నట్లు
తోక ముడుచుకొన్నట్లు
తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే – అదీ తోచనమ్మ అత్తారి పుట్టింటికి పోయిందట
తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే – చూచీ చూడనట్లు చూచారట
తోటకూర నాడైనా చెప్పవైతివిరా కొడకా అన్నట్లు
తోట మీద వారికి, పీట మీద వారికి మొగమాట ముండదు
తోడులేక రాచపీనుగ వెళ్ళదు
తోడేలును గొర్రెలకు కాపుంచినట్లు
తోరణం కట్టగానే పెళ్ళయినట్టా?
తోరణం కట్టినింట్లో తగవు పనికిరాదు
తోలు కొరికే వాడు పోతే ఎముక కొరికే వాడు వస్తాడు
తోలు తీయకుండానే తొనలు మ్రింగినట్లు

Leave a Reply