మన తెలుగు సామెతలు (‘డ – ఢ’ అక్షరములతో)

Share Icons:

డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు
డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది
డబ్బుకుండే విలువ మానానికైనా లేదు
డబ్బుకోసం గడ్డి తినే రకంలాగా
డబ్బుకూ, ప్రాణానికీ లంకె
డబ్బు దాచిన వాడికే తెలుసు – లెక్క వ్రాసిన వాడికే తెలుసు
డబ్బు పాపిష్టిది
డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది
డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు
డబ్బురాని విద్య కూడు చేటు
డబ్బురాని విద్య దరిద్రానికే
డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు
డబ్బు సభ కడుతుంది – ముద్ద నోరు కడుతుంది
డాబుసరి బావా! అంటే డబ్బులేదే మరదలా! అన్నాడట
డూ డూ బసవన్నా అంటే తలూపినట్లు
డొంక తిరుగుడు మాటలు
ఢిల్లీ రాజు కూతురైనా పెళ్ళి కొడుకుకు లోకువే
ఢిల్లీ రాజైనా తల్లికి కొడుకే

Leave a Reply