మన తెలుగు సామెతలు (‘చ – ఛ ’ అక్షరములతో)

Share Icons:

చంక బిడ్డకు దండం అన్నట్లు
చంకన పిల్ల – కడుపులో పిల్ల
చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు
చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు
చందాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు
చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్లు
చంద్రునికో నూలుపోగు
చక్కదనానికి లొట్టిపిట్ట – సంగీతానికి గాడిద
చక్కనమ్మ చిక్కినా అందమే – సన్న చీర మాసినా అందమే
చక్కని రాజమార్గం వుండగా గోడలు దూకట మెందుకు?
చక్కనైన చుక్క కోసం లెక్కలేని యిక్కట్లన్నట్లు
చక్రవర్తి చేస్తే శృంగారం – చాకలాడు చేస్తే వ్యభిచారం
చచ్చిన తరువాత తెలుస్తుంది శెట్టిగారి బండారం
చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళ క్రింద
చచ్చిన పామును కొట్టటానికి అందరూ మొగాళ్ళే
చచ్చిన పామును కొట్టినట్లు
చచ్చిన బిడ్డకు బారడేసి కండ్లు
చచ్చినవాడి పెండ్లికి వచ్చిందే కట్నం
చచ్చినా పంచాంగం బ్రాహ్మణుడు వదలడు
చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్లు
చచ్చేదాకా బ్రతికితే పెళ్ళి చేస్తామన్నట్లు
చచ్చేదాకా వైద్యుడు వదలడు
చచ్చే రోగికి మందు పట్టదు
చదవేస్తే ఉన్న మతి పోయిందట
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం
చదివిన వాడికన్నా చాకలాడు మేలు – చాకలాడికన్నా మేకలాడు మేలు
చదువక ముందు కాకర కాయ – చదివిన తర్వాత కీకరకాయ
చదువా లేదు – మరువా లేదు
చదువరి మతికన్నా చాకలి మతి మేలు
చదువుకు ముదురు – సాముకు లేత
చదువు చన్ను విడిచి చన్ను పట్టుకునే లోపలే రావాలి
చదువు చారెడు – బలపాలు దోసెడు
చదువు మా యింటా వంటా లేదు
చదువురాని మొద్దు – కదలలేని ఎద్దు
చదువు సన్నమయ్యె – అయ్య లావయ్యె
చదువూ లేదు – సంధ్యా లేదు
చద్దికంటే ఊరగాయ నయం
చద్దికూడు తిన్నమ్మ మగడి ఆకలి ఎరుగదు
చద్దిమూటలో సారం చాకలెరుగును
చనువిస్తే చంక కెక్కినట్లు
చన్ను కుడిచి రొమ్ము గుద్దినట్లు
చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు
చప్పిడి చేస్తే జబ్బు కుదురుతుంది
చమురు దండుగ భాగవతం
చలికి జడిసి కుంపటి ఎత్తుకున్నట్లు
చలిరాత్రి విరహాలకు కౌగిళ్ళే దుప్పట్లు అన్నట్లు
చల్ల ఎట్లా వున్నయిరా అంటే చల్లకన్నా గొల్లదే బావుంది అన్నాట్ట
చల్ల కుండకు, చంటి బిడ్డకు చాటుండాలి
చల్లకు వచ్చి ముంత దాచినట్లు
చళ్ళు జారిన ముండకు వట్టలు జారిన విటుడు
చవీ సారంలేని కూడు చట్టినిండా – మొగతనం లేని మొగుడు మంచంనిండా
చవుక కొన నీయదు – ప్రియం అమ్మనీయదు
చస్తే గానీ బర్రెపాడి బయటపడదు
చాకలి కొత్త -మంగలి పాత
చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప అయ్యవద్ద పసేంలేదు
చాకలిది సందె ఎరుగదు – మాలది మంచమెరుగదు
చాకలి-మంగలి పొత్తు – ఇంటికి రాదు సొత్తు
చాకలి వాడు ఏ రేవున వుతికితేనేం?
చాదస్తపు మొగుడు చెపితే వినడు – చెప్పకపోతే కరుస్తాడు
చాలని బట్ట కొంటే చినిగేవరకూ దుఃఖం – చాలని మగడిని చేసుకుంటే చచ్చేవరకూ దుఃఖం
చాలుపై చాలు దున్నితే చచ్చుచేనైనా పండుతుంది
చావా చావడు ప్రాణాలు తీస్తున్నాడన్నట్లు
చావుకంటే గండం లేదు
చావు కబురు చల్లగా చెప్పమన్నారు
చావుకు చావుందా?
చావు కాలానికి సమర్త కట్నాలు
చావుకు పెడితే గానీ లంఖణాలకు దిగడు
చావుకు ముదురు, లేతా వుంటాయా?
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు
చింతకాయలమ్మేదానికి సిరిమానమొస్తే, చింతకాయను చూసి టుంకిరి బింకిరికాయ ఇదేమి కాయ అన్నదట
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు
చింతకాయలు బేరం చేస్తూ వంకాయల్ని ఏరినట్లు
చింత చెట్టు టూటిందంటే టూటేకాలమొస్తే టూటదా అన్నదట
చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట
చింతాకంత బంగారంతో మెడచుట్టూ గొలుసు కావాలన్నట్లు
చిక్కితే దొంగ – చిక్కకుంటే దొర
చిక్కినవాడు సిగ్గెరుగడు – బలిసిన వాడు వావి ఎరుగడు
చిక్కినవానికి సిగ్గేమిటి?
చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి
చిచ్చు అంటుకొంటే చేతులతో ఆర్పగలమా?
చిచ్చును ఒడినికట్టి తెచ్చినట్లు
చిటికెలతో పందిరి వేసినట్లు
చితి చచ్చినవాణ్నీ, చింత బ్రతికిన వాణ్నీ కాలుస్తుంది
చిత్తం చెప్పుల మీద – భక్తి శివుడి మీద
చిత్తం మంచిదయితే వూరూ మంచిదవుతుంది
చిత్తం వనితల మీద – ధ్యానం దేవుడి మీద
చిత్త ఎండకు పిట్టల తలలు పగుల్తాయి
చిత్తకార్తె కుక్కలాగా
చిత్త కురిస్తే చింతలు కాస్తాయి
చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పంటిస్తాను అంటుంది వరి
చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న
చిత్త చినుకు తన యిష్టమున్న చోట పడుతుంది
చిత్త జల్లు – చిత్త ఉబ్బ
చిత్త జల్లు – స్వాతి వాన
చిత్తకు చిరుపొట్ట వరికి
చిత్తరువుకు జీవం వచ్చినట్లు
చిత్తలో చల్లితే చిట్టెడు కాపు
చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు
చిత్తశుద్ధిలేని శివపూజ లెందుకు?
చిత్త, స్వాతీ సంధించినట్లు
చిత్త స్వాతులు చిత్తగించి విశాఖ విసురుతే మొదలు తంతే ఏడు గింజలు రాలుతాయి
చిదంబర రహస్యం
చివికి చివికి గాలివాన అయినట్లు
చినుకులకు చెరువు నిండుతుందా?
చిన్న యిల్లు – పెద్దకాపురం
చిన్ననోటికి పెద్దమాట
చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి
చిన్నమ్మ సింహద్వారాన వస్తే – పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది
చిన్నవాళ్ళు తింటే చిరుతిండి – పెద్దవాళ్ళు తింటే ఫలహారం
చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష
చిమడకే చిమడకే ఓ చింతకాయా! నీవెంత చిమిడినా నీ పులుపు పోదే!
చిలకకు చెప్పినట్లు
చిలిపి వూహల వయ్యారికి చిలిపిదనాల శృంగారం అన్నట్లు
చిలుం పట్టేవాడికి చిత్తం కుదరదు
చిలుం వదిలితేగానీ ఫలం దక్కదు
చిలుం వదిలిస్తే గానీ చీద్రం వదలదు
చిలుకపోతే పంజరం ఎందుకు?
చిల్లర దేవుళ్ళలాగా
చిల్లర శ్రీమహాలక్ష్మి
చిల్లి బాగాలేదని బెజ్జం వేసినట్లు
చీకటింట్లో చిందులు వేసినట్లు
చీకటి కొన్నాళ్ళు వెలుతురు కొన్నాళ్ళు
చీకితే లేనిది నాకితే వస్తుందా?
చీటీకి ప్రాణం ప్రాలు
చీడ అంటుతుందిగానీ, సిరి అంటదు
చీడ సిగ్గెరుగదు
చీద్రానికి చీరపేలు – దారిద్ర్యానికి తలపేలు
చీదితే ఊడే ముక్కు తుమ్మితే నిలుస్తుందా?
చీమ ఒళ్ళు చీమకు బరువు – ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు
చీమలు చెట్టెక్కితే భూములు పండుతాయి
చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలు
చీర కట్టినమ్మ శృంగారం చూడు – గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు
చీరకు, రవికకు చిక్కని సిగ్గే ఫలహారం అందట
చీర సింగారించేటప్పటికి ఊరు మాటు మణిగింది
చీరకు సిగ్గులు – రవికకు ముద్దులు నేర్పినట్లు
చీరే శృంగారం స్త్రీకి
చుట్టం ఆకలి దేవుడెరుగు
చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకున్నట్లు
చుట్టం వచ్చాడు అంటే, చెప్పులెక్కడ వదిలాడో చూడు అన్నట్లు
చుట్టతాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట
చుట్టరికం, పేదరికం కలిసివచ్చినట్లు
చుట్టలకు పెట్టినిల్లు చూరబోయింది – వేల్పులకు పెట్టినిల్లు హెచ్చిపోయింది
చుట్టు అయినా సులువు దారే మంచిది
చుట్టుకుంటే ఆడదాన్నే చుట్టుకోవాలి – పంచుకుంటే అతివ అందాలనే పంచుకోవాలి
చుట్టూ చూరు మంగళం – నడుమ జయమంగళం
చుట్టూ శ్రీవైష్ణవులే – కల్లుకుండ కనబడటం లేదు
చూపుడాబేగానీ చేతడాబు లేదు
చూపులకు కడుపులొస్తాయా? ముద్దులతో ఆకలి తీరుతుందా?
చూసి మురుసుకొని – చెప్పి ఏడ్చుకొని
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు
చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి – చేసేవారుంటే పిల్లల్ని కనాలి
చూడ చుట్టము లేదు – మ్రొక్క దైవము లేదు
చూడబోతే చుట్టాలు – రమ్మంటే కోపాలు
చూడవమ్మ సుతారం – ఇంటావిడ అవతారం
చూపితే మానం పోయె – చూపకపోతే ప్రాణం పోయె
చూపుల గుర్రం
చూపులకు సుందరి – మాటలకు మంధర
చూపులకే ఆబోతు రూపం – పనిలో నీరసాలరాజు
చూపులకే కడుపొస్తే మొగుడెందుకు అందిట
చూపుల మగవాడే కానీ – సుఖాల మగడు కాదు అన్నట్లు
చూపుల పసే గానీ చేతల పసలేదన్నట్లు
చూపులో చుక్కలు -కోకలో సోకులు
చూపే శృంగారం – ఊపే వయ్యారం
చూరుకత్తి తెగుతుంది కానీ చూపుకత్తి తెగుతుందా?
చూసి త్రొక్కు – తెలిసి మ్రొక్కు
చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిందట
చూస్తే చుక్క – లేస్తే కుక్క
చూస్తే నీది – లేకుంటే నాది
చూస్తే పొరపాటు – చూడకుంటే గ్రహపాటు
చెంబు అమ్మి తపేలా – తపేలా అమ్మి చెంబు
చెంప నొక్కుడుకన్నా కౌగిలింతే కమ్మగా వుందన్నదట
చెట్టుంటే చెద వుంటుంది
చెట్టు ఎక్కేవాడికి ఎంతదాకా ఎక్కుడు మెట్లు పెట్టగలం?
చెట్టు ఎక్కనిచ్చి నిచ్చెన తీసినట్లు
చెట్టు చచ్చినా చేవ చావదు
చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు
చెక్కకపోతే దిమ్మ – చెక్కితే బొమ్మ – గుళ్ళో వుంటే అమ్మ అన్నట్లు
చెట్టు నాటేదొకడు – ఫలం అనుభవించే దొకడు
చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి మీద పడ్డట్లు
చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు
చెట్టునుబట్టే కాయ
చెట్టులేని చేను – చుట్టాలు లేని ఊరు
చెట్టెక్కి చేతులు విడిచినట్లు
చెడదున్ని శనగలు చల్లమన్నారు
చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి అన్నట్లు
చెడిన కాపురానికి ముప్పేమిటి? చంద్రకాంతలు వండవే పెళ్ళామా అంటే
అప్పుకి అంతేమిటి అవే వండుతాను మగడా అందట
చెడిన చేనుకు ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?
చెడిన శ్రాద్ధం చెడనే చెడింది – పిత్తరా పీట పగుల అన్నట్లు
చెడినా, పడినా చేసుకున్న మొగుడు తప్పడు
చెడినా శెట్టి శెట్టే – చినిగినా పట్టు పట్టే
చెడి బ్రతికినమ్మ చేతలు చూడు – బ్రతికి చెడ్డమ్మ చేతులు చూడు
చెడి స్నేహితుని ఇంటికి పోవచ్చుకానీ చెల్లెలింటికి పోరాదు
చెడిన సొమ్ము చెరిసగం
చెడుకాలానికి చెడు బుద్ధులు
చెడుచెడుమనే వారేగానీ చేతిలో పెట్టేవారు లేరు
చెన్నంపల్లి పంచాయతీ చెరిసగం
చెప్పటం తేలిక – చేయటం కష్టం
చెప్పటం కంటే చేయడం మేలు
చెప్పి నేర్పినమాట మంచిమాట
చెప్పింది చేయకు – చేసేది చెప్పకు
చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో – మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో
చెప్పితే సిగ్గు – దాస్తే రోగం
చెప్పుక్రింద తేలులాగా
చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం
చెప్పుడు మాటలు చేటు
చెప్పును పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు
చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ పోరాదు
చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళమీదే
చెప్పులోని రాయి – చెవులోని జోరీగ
చెప్పులోని రాయి – ఇంటిలోని పోరు ఒక్కటే
చెప్పేవాడికి చేసేవాడు లోకువ
చెప్పేవాడికి చాదస్తమయితే వినేవాడికి వివేకం ఉండొద్దా?
చెప్పేవి నీతులు – తీసేవి గోతులు
చెప్పేవి శ్రీరంగనీతులు – చేసేవి దొమ్మరి పనులు
చెమటే చందనం – అధరమే అమృతం అన్నట్లు
చెయ్యంగా లేంది చెపితే తీపరమా?
చెయ్యి చూసి అవలక్షణ మనిపించుకున్నట్లు
చెయ్యిని దాచుకుంటాం గానీ కులం దాచుకుంటామా?
చెయ్యి పుచ్చుకు లాగితే రాలేదుగానీ రమ్మని చీటీ వ్రాశాట్ట
చెరపటానికి చేతులు వస్తాయి గానీ నిలపడానికి చేతులు రావు
చెరపకురా చెడేవు – ఉరకకురా పడేవు
చెరకు తోటలో ఏనుగు పడట్లు
చెరకు పిప్పికి ఈగలు మూగినట్లు
చెరకు వంకరపోతే తీపి చెడుతుందా?
చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్లు
చెరువు ఓడు – ఊరు పాడు
చెరువుకు గండిపడి నీళ్ళు పోతుంటే, పీత బొక్కలు పూడ్చినట్లు
చెరువుకు చేరువ – చుట్టాలకు దూరం ఉండాలి
చెరువు నిండితే కప్పలు చేరవా?
చెరువు నిండితే కప్పలు చేరుతాయి
చెరువు నిండితే కప్పలు – సంపదలోనే చుట్టాలు
చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోవటం మానినట్లు
చెరువు ముందు చలివేంద్రం పెట్టినట్లు
చెరువులో వున్న గేదెను కొమ్ములు చూసి బేరమాడినట్లు
చెలి మాట తేనెల వూట
చెల్లని కాసుకు కాంతులు మెండు
చెల్లని కాసూ – ఒల్లని మొగుడూ ఒక్కటే
చెవి తెగిన మేకవలె
చెవిటి చెన్నప్పా అంటే సెనగల మల్లప్పా అన్నట్లు
చెవిటివానిముందు శంఖ మూదినట్లు
చెవిటివాని ముందు శంఖమూదితే దాన్ని కొరకను నీ తాతలు దిగి రావాలన్నాడట
చెవి దగ్గర కందిరీగలాగ
చేటలో వెలగకాయల్లాగా
చేటు కాలానికి చేటు బుద్ధులు
చేటు మూడినట్లు
చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట
చేతకానమ్మకు రోష మెక్కువ
చేతకానివాడికి చేష్టలు ఎక్కువ
చేతలు శూన్యం – మాటలు బహుళం
చేతికర్ర చేదోడు వాదోడు
చేతికి గడియారం – ఇంట్లో పొడివారం
చేతికి పట్టిన జిడ్డు లెక్కకు రాదు
చేతి చమురు వదిలినట్లు
చేతిలో వుంటేనే అర్థం – పక్కలో వుంటేనే పెళ్ళాం
చేతిలో విషమున్నా తినందే చావరు
చేతి వ్రేళ్ళు అయిదూ ఒక రీతిగా ఉన్నాయా?
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు
చేనుకు గట్టు ఊరికి కట్టు ఉండాలి
చేను పండినా చేట అప్పే – మొగుడున్నా మొండి మెడే
చేను పండాలి – ఇల్లు నిండాలి
చేపపిల్లకు ఈత నేర్పాలా?
చేయని చేతులు – కుడవని నోరు
చేయని శృంగారం – మాయని మడత
చేయలేనమ్మకు చేతినిండా పని
చేయలేనమ్మకు కులుకులు మెండు – వండలేనమ్మకు వగపులు మెండు
చేలో పుట్టిన బీడు ఎక్కడికి పోను?
చేలో పొత్తు కళ్ళంతో సరి
చేలో లేనిది చేతిలో కెలా వస్తుంది?
చేవ చచ్చినా షోకులు పోనట్లు
చేసింది పోదు – చేయంది రాదు
చేసినదంతా అనుభవించాలి
చేసిన చేష్టలు ఎవరూ చూడరు, కోసిన ముక్కు అందరూ చూస్తారు
చేసిన చేతికి చేవ – చేయనిచేతికి చీకు
చేసిన చేతికే వెన్న ముద్దలు
చేసిన పాపం చెపితే పోతుందా?
చేసిన పాపాలకూ పెట్టిన దీపాలకూ సరి
చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు
చేసిన మేలు వృధా కాదు – చేసిన కీడు వృధా పోదు
చేసిన వారికి చేసినంత మహదేవ!
చేసుకున్న తర్వాత వండిపెట్టక తప్పుతుందా?
చేసుకున్న కడుపు దింపుకోక తప్పదు
చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవ
చేసేదేమో బీదకాపురం – వచ్చేవేమో రాజరోగాలు
చేసేది శివ పూజ – దూరేది దొమ్మరి గుడిసె
చేసే పని చేయమంటే – నేసేవానివెంట పోతానన్నట్లు
చేసేవి నాయకాలు, అడిగేవి తిరుపాలు, పెట్టకుంటే కోపాలు
చేసేవి లోపాలు – చెపితే కోపాలు
చేసేవి శివపూజలు – చెప్పేవి అబద్ధాలు
చేస్తే మంచిపని చేయాలి – బ్రతికితే మంచిగా బ్రతకాలి
చోటే లేదంటే మూల కూర్చోనా అన్నట్లు
ఛీ! కుక్కా అంటే, ఏమక్కా! అని అన్నదట

Leave a Reply