ఆ హీరోయిన్ సంపాదన రూ.77 కోట్లు!

priyanka chopra earns income of rs 77 cr in 2017
Share Icons:

ముంబాయ్, ఆగష్టు 14,

ఇప్పటివరకూ బాలీవుడ్ హీరోలు మాత్రమే భారీ సంపాదనతో వార్తల్లో నిలిచే వాళ్లు. ఇప్పుడు హీరోయిన్లకు కూడా టైమొచ్చింది. పేజ్ 3లో మెరిసిపోతున్నారు. నటీమణులు కూడా బాగా సంపాదిస్తున్నారు… ఎంత అంటే ఆ మొత్తం మన కళ్లు తిరిగేటంత… నటి  ప్రియాంక చోప్రా సంపాదన గురించి ‘ఫోర్బ్స్’ పత్రిక ఒక ఆసక్తిదాయకమైన కథనాన్ని ప్రచురించింది.  దాని ప్రకారం.. ప్రియాంక గత ఏడాదిలో రూ. 77 కోట్లు సంపాదించిందట.

సినిమాల ద్వారా, ప్రకటనలు, ఇతర ఎండార్స్‌మెంట్ డీల్స్ ద్వారా ప్రియాంక ఈ మొత్తాన్ని సంపాదించిందని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటీమణికి హాలీవుడ్‌లో కూడా అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. అమెరికన్ సినిమాల్లో.. టీవీ షోల్లో  ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న ప్రియాంక సంపాదన గణనీయంగా పెరిగినట్టుగా తెలుస్తోంది.

స్థూలంగా 2017 సంవత్సరంలో ప్రియాంక చోప్రా రూ. 77 కోట్ల సంపాదించిందని స్వంతం చేసుకుందట. అయితే  పన్నులన్నీ పోనూ ప్రియాంక గత ఏడాదిలో దాదాపు 56 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లిందని అంచనా. ఇది కూడా భారీ మొత్తమే కదా.

మాామాట: సంపాదన అంటే… పన్నులుపోగానేకదా

 

Leave a Reply