ఒక్క క్లిప్‌తో…సన్నీ లియోన్‌నే మించిన ప్రియా ప్రకాష్‌…!!!

ఒక్క క్లిప్‌తో…సన్నీ లియోన్‌నే మించిన ప్రియా ప్రకాష్‌…!!!
Views:
19

న్యూఢిల్లీ, 13 ఫిబ్రవరి:

ప్రియా ప్రకాష్ వారియర్ లుక్స్‌కి మ‌త్తెక్కి మైమ‌రిచిపోతున్నారు కుర్రాళ్లంతా. ఈ భామ లుక్ ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిందో లేదో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయిపోయింది.

ఈమె దెబ్బకి ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లు అల్లాడిపోయాయి. వాట్సాప్ ను సైతం ఈ భామ ఊపుఊపింది.

ఈ క్రమంలో గూగుల్‌ సెర్చ్‌లో ఇప్పటి వరకూ టాప్‌లో ఉన్న సన్నీలియోన్‌ను ప్రియా ప్రకాష్‌ వారియర్ దాటేసింది.

priya prakash expressions

త్వరలో విడుదల కానున్న మళయాళం మూవీ “ఒరు ఆధార్‌ లవ్‌”లో ప్రియా హావభావాలతో పలికించిన క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రాత్రికి రాత్రే ఎవరూ సెలబ్రిటీలు కారని ఎవరన్నారు? ఒక్కసారి ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూడండి. ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఒక్క స్మైల్..

కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టింది. సోషల్ మీడియా క్వీన్‌ను చేసేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

దాంతో గూగుల్‌ మోస్ట్ సెర్చ్‌డ్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా ప్రకాశ్.

అంతేకాకుండా ప్రియా ధాటికి కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకోన్‌లూ గూగుల్‌ సెర్చ్‌లో వెనుకపడ్డారు.

మామాట: సోషల్ మీడియానా మజాకా…

English Summary: Malayalam actress Priya Prakash Varrier became an overnight sensation across the country courtesy the tiny clip from the newly-released song Manikya Malaraya Poovi. The song is from her upcoming Malayalam film Oru Adaar Love. The clip has been released just in time to coincide with the season of love, Valentine’s Day.. This reflects in the fact that Priya not just became one of the most searched celebrities online, but also beat Sunny Leone

(Visited 5 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: