భారత్ ప్రతిపాదనకు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్…!

Share Icons:

భారత్ ప్రతిపాదనకు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్…!

ఇస్లామాబాద్‌, మార్చి 8ః

ఇరు దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న మహిళలు, చిన్నపిల్లలు సహా 70 ఏళ్లు దాటిన ఖైదీలకు విముక్తి కల్పించాలన్న భారత ప్రతిపాదనకు పాకిస్తాన్ ఆమోదం తెలిపింది.

దాయాది దేశాల మధ్య మళ్లీ చర్చలకు మార్గం సుగమం అయ్యేలా.. మానవతా దృక్పథంతో ఖైదీలను ఇచ్చిపుచ్చుకునేందుకు పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా అంగీకారం తెలిపారు.

దీనిపై భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ… ‘‘ఇరు దేశాల్లోని వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా మతిస్థిమితం లేని ఖైదీలను మానవతా దృక్పథంతో ఇచ్చిపుచ్చునేలా భారత్ ప్రతిపాదించింది. అక్టోబర్ 2017న భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్ హైకమిషనర్‌కు ఈ ప్రతిపాదన పంపారు. అందుకు పాకిస్తాన్ అంగీకరించింది..’’ అని వెల్లడించారు.

కాగా పాకిస్తాన్ వీటితోపాటు మరో రెండు ప్రతిపాదనలు కూడా చేసింది. 60 ఏళ్లు దాటిన, మైనర్ కేటిగిరీలకు చెందిన వారిని కూడా ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని భారత్‌ను కోరింది. ఇరు దేశాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మానసిక రోగులను డాక్టర్లతో పరీక్షించి నిర్ధారించాకే విడుదల చేయాలన్న ప్రతిపాదనకు కూడా పాక్ ఓకే చెప్పింది.

మామాటః పాకిస్తాన్ ఈ మాత్రం మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

English Summery: Pakistan agreed to free the women, child and mentally disabled Indian prisoners from their jails. This proposal brought to the notice of Pakistan and it has agreed up on. India also do the same.

Leave a Reply