ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌ మోడి ధర్నా 

Share Icons:

జైపూర్‌,మే15,

భారత ప్రధాని నరేంద్ర మోడి సోదరుడు, ప్రహ్లాద్‌ మోడి తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ మంగళవారం ధర్నా చేపట్టారు. జైపూర్‌-అజ్మేర్‌ జాతాయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రహ్లాద్‌ మోదీకి ఇద్దరు పీఎస్‌వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను కేటాయించారు.

నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లనని, వారికి ప్రత్యేక పోలీస్‌ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్‌ ఆందోళన సాగింది.

అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై వ్యాక్యానించడానికి బీజేపీ వర్గాలు అందుబాటులో లేవు.

మామాట- మరి తమ్ముడు ప్రధానైతే.. ఆ మాత్రం ఉండదా.

Leave a Reply