సుప్రీం కోర్టుకు చేరిన టీటీడీ వివాదం

Share Icons:

న్యూఢిల్లీ, జూన్ 13 :

తిరుమల తిరుపతి దేవస్థాన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీం కోర్టుకు చేరింది. తమ నియామకాలపై తమకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని నూతనంగా నియమితులైన ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం వేణుగోపాల దీక్షితులు న్యాయవాది కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలోని ప్రధానార్చకులు రమణదీక్షితులుచే బలవంతపు పదవీవి రమణ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టీటీడీ బోర్డు వేణుగోపాల్ దీక్షితులును ప్రధాన అర్చకులగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇలాంటి తరుణంలో రమణదీక్షితులు కోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇంతలోనే తన నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే తమకు ముందస్తు సమాచారమివ్వకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని వేణుగోపాల దీక్షితులు కేవియట్ దాఖలు చేసిన్టటు న్యాయవాది తెలిపారు.టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నరని ఆయన ఆరోపించారు.

మామాట : కోర్టుకెక్కిన శ్రీవారి అర్చక వివాదం

Leave a Reply