చంద్రబాబుకు మరో షాక్: గత విద్యుత్ ఒప్పందాలపై ఎంక్వైరీ…

Share Icons:

 

అమరావతి, 26 జూన్:

వరుసగా వివిధ రంగాలకు సంబంధించి సమీక్షలు చేస్తున్న సీఎం జగన్…ఈరోజు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. దీనిలో కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై సీఎం జగన్‌ దృష్టి పెట్టారు.

ఇప్పటివరకు జరిగిన పనులు, చెల్లింపులపై చర్చించారు. అధిక రేట్లకు విద్యుత్‌ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సంబంధింత అధికారులను ప్రశ్నించారు.

అలాగే ప్రభుత్వ ఖజానాకు రూ.2, 636 కోట్లు నష్టం వాటిల్లిందని ఈ సమీక్షలో వెల్లడైంది. ఈ డబ్బును కంపెనీల నుంచి రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేసుకోవాలని జగన్‌ ఆదేశించారు.

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ఈ అవినీతిని తేల్చేందుకు కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అప్పటి సీఎం, మంత్రిపై న్యాయపరమైన చర్యలకు జగన్‌ ఆదేశించారు.
ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్‌ ఒప్పందాలు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ మేరకు మొత్తం 30అంశాలపై విచారణ చేస్తామని జగన్‌ స్పష్టంచేశారు.

Leave a Reply