TRENDING NOW

భయపెడుతున్న ప్రేమ కథా చిత్రం-2 మొద‌టి లుక్

భయపెడుతున్న ప్రేమ కథా చిత్రం-2 మొద‌టి లుక్

హైదరాబాద్, 17 అక్టోబర్:

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్‌ని క్రియెట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ సక్సెస్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2. ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.  ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” సినిమా మెద‌టిలుక్‌ని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేశారు.  ‘బ్యాక్ టూ ఫియర్ అనే క్యాప్షన్‌తో ఇప్ప‌టికే 90% షూటింగ్ పూర్తిచేసుకుని మ‌రో రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ షూటింగ్ పార్ట్‌ని పూర్తిచేసుకుంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు..

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు

మామాట: మళ్ళీ భయపెడుతుందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: