కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్? ముహూర్తమే మిగిలింది…

prashant kishore comments 2019 elections
Share Icons:
  • సోనియా సిగ్నల్ కోసం ఎదురుచూపులు
  • కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే అన్నట్లు . ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలోకి తీసుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. సోనియా గాంధీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు .

ప్రశాంత్ కిషోర్ చేరికపై కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు .

కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ కిషోర్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వ్యూహకర్తగా కొనసాగుతుండగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ ఆయనతో విబేధించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు . . కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు  ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేశారు. మొదట ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆయన కలిసిన విషయం తెలిసిందే.

 కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా?

. కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని, ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్ష పార్టీలో పోరాడాలని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే మరింత కలిసివస్తుందని అంటున్నారు., ప్రశాంత్ కిషోర్ పార్టీలోకి వస్తే రాజకీయం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీకి సరిపోవని నేతలంటున్నారు.

 ప్రశాంత్ కిషోర్ అహ్మద్ పటేల్ పాత్ర  ?

, కీలక నేత అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సలహదారు కోసం సోనియా గాంధీ వేచిచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన ను ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply