బీజేపీకి అప్పుడున్న ఊపు ఇప్పుడు లేదు కానీ…

prashant kishore comments 2019 elections
Share Icons:

పాట్నా, 12 నవంబర్:

2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు బీజేపీకి లేదని జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్(మాజీ ఎన్నికల వ్యూహకర్త) చెప్పారు. తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…ప్రధాని మోదీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదని,  కానీ, ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ సత్తా చాటలేదని అన్నారు. అయితే గత ఎన్నికల్లో కన్నా మెజార్టీ తక్కువ రానున్నప్పటికీ… బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.  

ఇక బీహార్‌కు సేవ చేయాలనే ఉద్దేశంతోనే, ఇతర రాజకీయ పార్టీలకు సలహాదారుడిగా పని చేయడం మానేసి, జేడీయూలో చేరానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. తాను కాంగ్రెస్, బీజేపీలతో కలసి పని చేశానని… రాజకీయాల్లో రాణించడం కఠినమైన విషయమని అన్నారు. జేడీయూ నేతల సగటు వయసు 45 ఏళ్లకు తీసుకు వచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు.

ఇక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వేసే అంచనాలన్నీ తారుమారవుతాయని… చివరి 10 నుంచి 12 రోజులే అత్యంత కీలకమని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి 272 సీట్లు రావడం కష్టమేనని చెప్పారు. ప్రతిపక్షం బలమైనదా, కాదా అనే దానికన్నా ఇతర అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని పీకే తెలిపారు. పేదవారు ఎవరికి ఓటు వేస్తారో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.

మామాట: ఊపు తగ్గిన మెజారిటీ బీజేపీదేగా…

One Comment on “బీజేపీకి అప్పుడున్న ఊపు ఇప్పుడు లేదు కానీ…”

Leave a Reply