కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్!?

Share Icons:
సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ
కాంగ్రెస్ లో కీలక పాత్ర ప్రశాంత్??

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారా?  అనేక రాష్ట్రాలలో ఆయన తన వ్యూహాల ద్వారా అధికారాన్ని అందించి సెక్సెస్ అయ్యారు. ప్రధానంగా బెంగాల్ ఎన్నికల్లో ఆయన జోశ్యం 100 శాతం నిమమైంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని ,మోడీ అమిత్ షా  పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో బీజేపీకి అంత సీన్ లేదని ప్రకటించారు. అంతే కానుందా బీజేపీకి 100 సీట్ల లోపే వస్తాయని బల్ల గుద్ది మరి వాదించారు. అందువల్ల ప్రశాంత కిషోర్ వ్యూహాలకు రాజకీయ నేతలు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన సోనియా , రాహుల్ , ప్రియాంక గాంధీ ని కలిసి వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రత్యేకించి పార్టీ చేరే విషయం , ఆయన స్తానం పై చర్చలు జరిగి ఉండవచ్చుననే వార్తలు వైరల్ అవుతున్నాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply