రాహుల్, ప్రియాంక తో ప్రశాంత్ కిశోర్ భేటీ…

Share Icons:
  • రాహుల్, ప్రశాంత్ కిశోర్,  ప్రియాంక
  • తృతీయ కూటమి ఏర్పాటు?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…  రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సీఎం అమరీందర్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పంజాబ్ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నారా?

సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది .  ప్రశాంత్ కిషోర్ సీనియర్ నేత ఎన్సీపీ కు చెందిన మరాఠా యోధుడు శరద్ పవర్ తో భేటీ అయ్యారు . అంతకు ముందు ఆయన బెంగాల్ ఎన్నికల తరువాత ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని చెప్పారు.తరువాత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను పని చేస్తానని ప్రకటించారు.  దేశ రాజకీయాలలో మూడవ ఫ్రంట్ వాదనలు ముందుకు వచ్చాయి. శరద్ పవర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల నుంచి పోటీకి నిలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థమని శరద్ పవర్ తోపాటు ఆర్జేడీ నేత అభిప్రాయపడ్డారు .  రాహుల్ ,ప్రియాంక భేటీ పై రరకాల చర్చలు జరుగుతున్నాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply