మా’ సభ్యుల కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్: ప్రకాశ్ రాజ్!

Share Icons:
  • ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ  
  • జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు
  • హాజరైన 100 మంది నటీనటులు

సినీ కళాకారుల అసోసియేషన్ “మా ” ఎన్నికలు రసవత్తరంగా మారాయి.  సినీ రంగం రాజకీయరంగాన్ని తలపిస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించి ప్రచారం కూడా ప్రకటించారు. చిరంజీవి మద్దతు దార్లు అంట ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతుగా నిలవడంతో ,మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడి బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో ఎన్నికలు రంజుగా మారాయి.దీంతో విందు రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్ మా సభ్యులతో  హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షెన్ సెంటర్ లో సమావేశమయ్యారు. ఈ  విందు సమావేశానికి ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులు 100 మంది  హాజరయ్యారు.  ‘మా’ ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై  ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, తమ ప్యానెల్ గెలిస్తే ‘మా’ సభ్యుల సంక్షేమానికి రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అసోసియేషన్ లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని వెల్లడించారు.

 విందు రాజకీయాలపై బండ్ల గణేశ్,  ‘మా’ ఎన్నికల్లో ఓటు కావాలంటే ఫోన్ చేయండి. కరోనా వేళ విందుల పేరుతో సమావేశాలు వద్దు అని హితవు పలికారు. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు అని వ్యాఖ్యానించారు. అంతుకుముందు అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన జీవిత రాజశేఖర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తుంది.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply