సొంత టీవీ చానెల్ ను ప్రారంభించనున్న ప్రభాస్!

Share Icons:

హైదరాబాద్, మే 15,

ఇప్పటికే ఎంతో మంది స్టార్లు ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు వ్యాపారాన్ని నిర్వహిస్తూ, రాణిస్తుండగా, వారి దారిలోనే ప్రభాస్ నడవనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ చిన్ననాటి స్నేహితులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లు త్వరలో ఓ తెలుగు టీవీ చానెల్ ను ప్రారంభించాలని నిర్ణయించుకోగా, అందులో ప్రభాస్ కూడా భాగస్వామి కానున్నారని సమాచారం.

దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. సూళ్లూరుపేట సమీపంలో ప్రభాస్ ఓ భారీ సినిమా థియేటర్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ తో ఉంటుందట. త్వరలోనే ఈ థియేటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కాగా, గతంలో నాగార్జున, చిరంజీవి ‘మా టీవీ’లో పార్టనర్స్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరిట చిత్ర ప్రదర్శన రంగంలోకి కూడా కాలుమోపారు. మహేశ్ దారిలోనే నడవాలని భావిస్తున్న బన్నీ, ఓ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నాడు.

మామాట – ఈ సినిమాలకంటే అదే బెటరా బ్రదర్

Leave a Reply