సాహో తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఇదే…

prabhas next movie announcement
Share Icons:

హైదరాబాద్, 6 సెప్టెంబర్:

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే తన తదుపరి సినిమా విశేషాలను వెల్లడించాడు ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా తన నెక్స్ట్ సినిమా ఎవరితోననే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.

తన నెక్స్ట్ సినిమా త్రైలింగ్వల్ ఫిలిం లాంచ్ కాబోతుందని, ఈ విషయం చెప్పడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాని తెలిపారు. ఇక కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో.. ఈ చిత్రాన్ని గోపి మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. పూజాహెగ్డేతో హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం యొక్క షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన బరువుని తగ్గించే పనిలో పడ్డాడట. రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

మామాట: బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడుగా…

Leave a Reply