Power Star: వెండితెరపై రామ్ గోపాల్ వర్మ.. ఆ కీలక రోల్ ఆయనదే! వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్టర్

Share Icons:
ఇన్ని రోజులు తెరవెనుక ఉండి సంచలనాలు సృష్టించిన .. తన లేటెస్ట్ మూవీ ‘’లో వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు అప్‌డేట్స్ రిలీజ్ చేసి సినీ, రాజకీయ వర్గాల్లో అనుమానాలు రేకెత్తించిన ఆయన, తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని తెలియడం మరింత ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, ఆ కాంట్రవర్సీకి లాజికల్ సమాధానం చెప్పాలన్నా తనను మించిన వాడు లేడన్నట్లుగా వ్యవహరిస్తున్న వర్మ.. పవర్ స్టార్ సినిమాతో సరికొత్త చర్చలకు తెరలేపారు.

ఈ మూవీ ఎవరినీ ఉద్దేశించి తీయడం లేదని, ఎవరినీ తక్కువ చేసేది లేదని చెబుతూనే వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సెన్సేషనల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ ఎదురుగా ఓ వ్యక్తి కూర్చొని కనిపిస్తున్నారు. కాకపోతే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం తెలియకుండా వెనుక నుంచి చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే ఈ వ్యక్తి ఎవరో కాదు.. ”పవర్ స్టార్‌కు వీరాభిమాని, అలాగే నువ్వే నా దేవుడివి, నేను నీ భక్తుడిని.. ఎన్నికలో మనదే గెలుపు” అని చెప్పుకుంతూ తిరిగే పర్సన్ అని సోషల్ మీడియాలో వార్తలు షికారు వస్తున్నాయి. అది నిర్మాత బండ్ల గణేష్ పాత్ర అని అంటున్నారు కొందరు వ్యక్తులు.

Also Read:
అంతేకాదు ఆ కీలక పాత్రను స్వయంగా రామ్ గోపాల్ వర్మనే పోషిస్తున్నారని చెబుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ”ఎన్నికల అనంతరం జరిగిన కథ” అనే ట్యాగ్ లైన్ పెట్టి అచ్చం పవన్ కళ్యాణ్ రూపురేఖలతో ఉన్న యాక్టర్‌తో ఈ మూవీ రూపొందిస్తున్నారు వర్మ. టైటిల్ మాత్రం ‘పవర్ స్టార్’ అని డిసైడ్ చేసి చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ పోలికలతో కూడిన యాక్టర్లను తీసుకోవడం.. పైగా అందుకు సంబంధించిన పోస్టర్స్‌తో హంగామా చేస్తుండటం ఈ మూవీ పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. సో.. చూడాలి మరి ఈ మూవీలో వర్మ అభినయం ఎలా ఉంటుందనేది!.