విద్యుత్ కోతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు ముందస్తు వార్నింగ్!

Share Icons:
  • భవిష్యత్తులో అధికారిక విద్యుత్ కోతలు : సజ్జల
  • విద్యుత్ సమస్య తీవ్రం. బొగ్గు కొరత 
  • ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. డబ్బు ఖర్చుచేసినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. విద్యుత్ అంశంపై కేంద్రమంత్రి చెప్పింది అవాస్తవం అని సజ్జల అన్నారు. సీఎం ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అధికారికంగా కోతలు రావొచ్చని వివరించారు. ఇళ్లలో విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు.. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని అన్నారు. అఫిడవిట్ల ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. లబ్దిదారులకు తెలియకుండానే కేసులు పెడుతున్నారని వివరించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply