పిల్లల కోడిపై రాజకీయ రాబందుల దాడి

Share Icons:

తిరుపతి, నవంబర్ 05,

రాజకీయాలు అత్యంత క్రూరమైనవి, అక్కడ అధికారమే ప్రధానం, దాని ముందు రక్తసంబంధాలు, తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, అన్నా-తమ్ములు, మామా-అల్లుళ్లు ఎవరూ నిలవరు.

రాజ్యం కోసం కన్న తండ్రినే ఖైదు చేసిన వారి గురించి మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. నేడు అధికారం కోసం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న దృశ్యం అత్యంత విషాదకరం.

[pinpoll id=”64617″]

 

ప్రతిపక్ష నేత జగన్ పై దాడిలో నిందమోస్తున్న శ్రీనివాస రావు చిన్నవాడు, యువకుడు, అతనిది పేద కుటుంబం, తల్లి దండ్రులు చదువు సంధ్యలు లేని పల్లెటూరి వారు. రెక్కాడితే గానీ డొక్క నిండని సామాన్యులు.  ఆ పల్లెవాసుల గుండెల్లో కుంపటి రగిలించిన సంఘటన కోడి కత్తి దాడి ఘటన. వాస్తవం ఏదైనా.. నేడు ఓ యువకుడు బందీగా మారాడు, బైయిల్ కోసం వెదుకుతున్నాడు.

ఇప్పటి న్యాయ, పోలీసు శాఖల తీరుతెన్నులు గమనించిన వారికి ఈ యువకుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా.  జగన్ పై దాడి అనే ఈ భారీ కుదుపుతో ఆ పల్లెటూరి వారి జీవనం దెబ్బతినలేదా, స్వార్థరాజకీయాలకు ఓ కుటుంబం కట్టుకుంటున్న భవితవ్యం అనే నివాసం కూలిపోలేదా… దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారం ఎలా లభిస్తుంది.   నేరస్తుడుగా ముద్రపడిన శ్రీనివాస రావు, అతని కుటుంబ సభ్యుల భవిత-జీవనోపాధి ఏలా ఉండబోతోంది.? ఎందుకంటే.. చేతి ఖర్చులకు ఇంటి నుంచి రూ.20, 30  తీసుకునే యువకుడు. పెట్రోలుకు డబ్బులు లేక అక్కను అడిగే వాడు, రాష్ట్ర క్యాబినేట్ మంత్రి హోదా కలిగిన ప్రతిపక్ష నేతపై, భారీ భద్రత ఉండే విమానాశ్రయంలో దాడికి పాల్పడతాడా? ఎవరి సహాయం, ప్రోద్భలం, మద్దతూ లేకుండా ఇది జరుగుతుందా? వెనకుండి నడిపించిన దోషులను పోలీసులు వెలుగులోకి తీసుక వస్తారన్న నమ్మకం ఎవరికైనా ఉందా?  “మా ఆరుగురిలో ఒకడు పోయాడు కదమ్మా” అన్న ఆ తల్లి ఆవేదన తీరేదెలా.. ?

మామాట: గూడుచెదిరినవాడి గోడు వినేవాడెవడో.. దేవుడా?

Leave a Reply