ప్రవాస భారతీయుల సహకారం తో పాలియేటివ్ కేర్ హాస్పిటల్

ప్రవాస భారతీయుల సహకారం తో పాలియేటివ్ కేర్ హాస్పిటల్
Views:
15

ప్రవాస భారతీయుల సహకారం తో పాలియేటివ్ కేర్ హాస్పిటల్

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 13ః రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం ఎంకపల్లిలో పాలియేటివ్ కేర్ హాస్పిటల్ కి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ప్రవాస భారతీయుల సహకారం తో రూ.1.5 కోట్ల వ్యయం తో హైదరాబాద్ పాలియేటివ్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆసుప్ర‌తి నిర్మాణం అవుతున్నది.

హైదరాబాద్ పాలియేటివ్ కేర్ ట్రస్ట్ కి ప్రవాస భారతీయులు ఆర్థిక సహకారం అందిస్తుండటం స్వాగతించదగ్గ విషయమ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి అన్నారు.

ఈ ఆసుపత్రి వారు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించడం గొప్ప విషయమ‌ని ఆయ‌న అన్నారు.

ఇందుకు ప్రత్యేకంగా వ్యాన్ ని నడుపుతుండటం వల్ల ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుందని మంత్రి అన్నారు.

ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు వైద్య రంగంలో ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రభుతం కూడా కాన్సర్ వంటి వ్యాధుల స్క్రినింగ్ మొదలు పెట్టిందని మంత్రి వెల్ల‌డించారు.

గ్రామాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా శిబిరాలు పెట్టి, వ్యాధుల‌ స్క్రినింగ్ చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

ఇంటింటికి వెళ్లి మధుమేహం, బీపీ వంటి పరీక్షలు చేసి, మందులు ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపట్టామ‌ని ఆయ‌న అన్నారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఏకె ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ చైర్మన్ మీర్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మామాటః ఆరోగ్యం విష‌యంలో ప్ర‌వాస భార‌తీయులు తీసుకుంటున్న శ్ర‌ద్ధ ప్ర‌శంస‌నీయం.

English Summery: Minister for Health for Telangana Government Ch.Laxmareddy to day inaugurated poliyative care hospital at Moinabad of Rangareddy district. He said that the initiative taken by the non resident Indians in this regard is appreciative.

(Visited 9 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: