నడక ఆరోగ్యప్ర(దా)జాయిని

poll 36 on Jagan comments on AP Government
Share Icons:

మనిషి నిరంతర ప్రయాణీకుడు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకూ కదలికలే మనుగడకు ప్రాణం. తిరిగి చెడినవాడు లేడు. తిరక్క చెడినవారున్నారు. ఆ నడకే మనిషిని చంద్రుని వరకూ చేర్చింది.

 

[pinpoll id=”62764″]

 

 

వైయస్ జగన్, అతనొక సైన్యం. నిరంతంరప్రజాసమూహం. మూడువేల కిలోమీటర్ల ప్రయాణం. పట్టుమని పది అడుగులు కూడా నడవలేని వారున్న రోజుల్లో ఎక పార్టీ అదినేత, ఒక ప్రతిపక్షనేత, ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడు. కూర్చుని తిన్నా కళవలపడనవసరంలేని సంపదలున్న వ్యక్తి… ఎందుకు! ఎందుకు?? .. ఎందుకు!? మూడు వేల కిలోమీటర్లదూరం.. దాటి.. నడుస్తున్నారు.

రాష్ట్రంలో పరిపాలకులు విజ్ఞతలోపించిన పాలన చేస్తున్నారు. దాదాపు అన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గూడు కట్టుకున్నది. ప్రతిపక్షాన్ని చీల్చి, పాలక పక్షంలో కలుపుకును, వారికి మంత్రి పజవులు కట్టబెడుతున్నా నోరెత్తేవారు లేరు. దారుణాలు సహిస్తున్న ప్రజలు తమ నేతకోసం చూస్తున్నారు. అందుకే నడుస్తున్న జగన్ తో సమస్యలు మొర పెట్టుకుంటున్న సామాన్యులు పెరుగుతున్నారు. ఎండ-వాన చూడకుండా, దారీ డొంకా విడవకుండా జగన్ అడుగులో అడుగువేసి కదం తొక్కుతున్నారు. బాధాతప్తహృదయాలను మీటుతున్న ఒదార్పువీచిక జగన్, ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిపాలన సాగించాలనే సన్మార్గతీరం జగన్.

గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలన పై ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని గుర్తించిన జననేత జగన్, కేంద్రంతో దోస్తో చేసి, హోదా ను దాట వేసి యువత భవితను కుదువ పెట్టిన పాలకులవంచనను నిగ్గతీసి అడుగుతున్న ప్రజావాణికి వేదిక జగన్. అందుకే మూడు వేల కిలో మీటర్లు నడిచినా, జనం పలచబడలేదు. దారివెంబడి జేజేలు పలుకుతున్నారు.

జగన్ ఇప్పటివరకు 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ప్రతి చోట , ప్రతి సభా జనంతో కిటకిటలాడింది. అనేక చోట్ల అనూహ్యంగా ప్రజామద్దతుతో పాటు నాయకులు కూడా మద్దతు ప్రటించారు. విపక్షాల నుంచి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇంత దూరం కాలినడకన ప్రయాణించడం దుస్సాహసం, దానిని విజయవంతంగా పూర్తిచేసి, మరింత ముందుకు వెళుతున్న జగన్ ను ప్రజలు స్వాగతిస్తున్నారు. పరిపాలనో ఉన్నవారి నైజాన్ని ప్రశ్నిస్తున్నారు. కన్నెర్రచేస్తున్నారు.

చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అన్న మాటలు గుర్తుచేసుకుందాం.. మనిషికి ఇది ఒక అడుగు, మానవాళికి గొప్ప ముందడుగు.

మామట : బడుగు బలహీనవర్గాల చీలికపేలికల జీవితాలను చూశారుగా….

Leave a Reply