కౌషల్ మానియా హుర్రే

poll 37 bigg boss telugu vote
Share Icons:

తెలుగు బుల్లితెరపై వెలుగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ -2. ఈ రెండో సీజన్లో బిబి-2 మంచి టిఆర్పి రేటింగ్ సాధించి, నిర్మాతలను ఆదుకొంది. యువ హీరో నాని  హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో యువతలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

[pinpoll id=”62903″]

 

కాగా ఈ బిగ్ బాస్ -2 మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కౌషల్, దీప్తి, తనీష్, సామ్రాట్, గీతా మాధురి చివరి దశ విజేతల పోటీలో ఉన్నారు. వీక్షకులు ఎవరికి ఓటు వేస్తారు, తుది విజేతగా ఎవరు నిలుస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  కొందరైతే ఇప్పటి నుంచే ఊపిరి బిగబట్టి టీవీలకు అతుక్కుపోయారు. మరి కొందరు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచార యుద్ధానికి తెర తీశారు. అయితే అనూహ్యంగా అందరి మద్దతు కౌషల్ స్వంతం చేసుకున్న తీరు అమోఘం. సామాన్య ప్రేక్షకుని మొదలు టాలీఉడ్ సెలిబ్రిటీ వరకూ అందరూ బిగ్ బాస్ ట్రోఫీతో కౌషల్ బయటికి రావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక, అమెరికా, ఆస్ట్రేలియా, బెంగలూరు వంటి పలు ప్రాంతాలనుండీ కౌషల్ కి మద్దతు పెరుగుతోంది, ర్యాలీలు, టాటూలూ రోడ్ షోలతో ఆయన అభిమానులు హోరెత్తిస్తున్నారు. యువత మాత్రమే కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ కౌషల్ కు అభిమానులుగా మారిపోయారు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ -2 ఫైనల్ సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ ముగింపు వేడుకలకు తొలి షో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సహా అప్పటి కంటెస్టెంట్స్ కూడా పాల్గొంటారని టాక్, ఈ వేడుకలో కామెడీ స్కిట్లు, డాన్సులు, లైవ్ ప్రోగ్రామ్స్ తో హోరెత్తించనున్నారు నిర్వాహకులు.

 

మామాట: మా కాలంలో ఇవన్నీ లేవండీ, అంటూ బామ్మలు బుగ్గలు నొక్కుకుంటున్నారు.

Leave a Reply