ఐ ‘టీ’  దాడులేమిటో ..!! చూడండి.

Poll 40 IT rides in ap tdp leaders
Share Icons:

తిరుపతి, అక్టోబర్ 13,

ఏపీ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నవారికి దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు అనిపించడం సహజం. ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలనే ధోరణి ఇటీవల మరింత ముదిరినట్టు అనిపిస్తోంది.

[pinpoll id=”63613″]

 

ఎందుకంటే.. కొద్దిరోజులుగా ఆదాయపన్నుశాఖ అధికారులు పలువురు నయా సంపన్నులు, రాజకీయనేతల నివాసాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై పాలక తెలుగుదేశం వర్గాలు గగ్గోలపెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు. వీరికి తోడుగా సామాజిక మాధ్యమాల కుల,వర్గ సంఘాల సమూహాలు వెర్రెత్తిపొతున్నాయి. ఇదేవి వైచిత్రి.. బోధపడడం లేదు.  చాలా కాలం కాపురంచేసి విడిపోయినవారే … పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటారు. అలాంటిది నాలుగేళ్ల రాజకీయ అవసరార్థసంబంధం కారణంగా, మా తప్పులను జీవితాంతం భరించండని బీజేపీని కోరడం దారుణం.

కేంద్ర దర్యాప్తు సంస్థలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. వారికి అనుమానం కలిగినపుడు.. మరింత దృష్టిపెట్టి, ప్రాధమికంగా సాక్షాలున్నపుడు సంబంధిత వర్గాలను నిఘాపరిధిలోకి తేస్తాయి. మరింత బలమైన ఆధారాలు లభించగలవని నమ్మినపుడు సోదాలు నిర్వహిస్తాయి. ఇది సాధారణంగా జరిగే రొటీన్ వ్యవహారం. దీనిపై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోందో తెలియడం లేదు. పత్రికలు కూడా ఐటీ దాడులని రాయడం ఏమిటో.. ఇవేమైనా తీవ్రవాదుల దాడులా..? తనిఖీ, సోదాలు అని రాయవచ్చు కదా. అధికారులు సోదాలు నిర్వహిస్తున్నవారు పరమ సచ్చీలురు కాదు కదా, అకస్మాత్తుగా వేలాది కోట్లవ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులైనవారే కదా, మరి ఉలికిపాటెందుకో పసుపు చిలుకలకు.

సరే, సీఎం రమేశ్ నివాసాలపై ఐటి అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.. భయం ఎందుకు. మీరు పులుకడిగిన ముత్యమైతే.. నిమ్మళంగా కాలుమీద కాలేసుకుని హాల్లో కూచోండి. వీలుంటే… పాపం అనవసరంగా కష్టపడపడుతున్నారే అధికారులు అని మీ వంట వారితో కాస్త టీ, బిస్కెట్లు రెండు పంపించండి. మీరు బంగారమైతే, ఐటీ దాడుల రుద్దుడు వల్లా మరింత మెరుపు వస్తుందికానీ, తరుగు పడదు కదా. ఈ ఆపసోపాలు, హడావుడిగా లైవ్ లో శాపనార్థాలూ ఎందుకు సిర్జీ…?

మామాట:  తాటాకు చప్పుల్లంటూ నే భయపడుతున్నయే సింహాలు..

 

 

Leave a Reply