పోలీసులపై టీడీపీ నేతల విమర్శలు…రివర్స్ అయిన పోలీసులు…

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ పోలీసులపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులపై విమర్శలు చేశారు. అలాగే ఇటీవల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడం, రాడ్లతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో పోలీసుల పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక ఈ నేపధ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, బీహార్ కంటే దారుణంగా పరిస్థితి ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు వైసీపీ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు పోలీసుల తీరుపై అటు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళారు.

రాష్ట్రంలో అరాచక పాలనకు కొందరు పోలీసులు సహకారం అందిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మాచర్ల ఘటనపై బుద్దా వెంకన్న , బోండా ఉమాలు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని , అయినా పోలీసులు రక్షణ కల్పించటంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాచర్ల ఘటన విషయంలో పోలీసులు, జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసు అధికారుల సంఘం రియాక్ట్ అయ్యింది.ఇక మాచర్ల ఘటన రోజు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారని వారు మండిపడ్డారు. దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను కాపాడారని చెప్పిన పోలీసు అధికారుల సంఘం నేతలు మా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని చెప్పుకొచ్చారు .

ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమపై దాడి జరిగిందని రిపోర్ట్‌ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు . సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.  పోలీసులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పిన పోలీసులు మీపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

Leave a Reply