వ్యభిచార గృహం గుట్టు రట్టు…

Share Icons:
  • దాడి చేసిన కర్నూలు పోలీసులు
  • నిర్బంధంలోకి నిర్వాహకులు
  • విటుడ్ని కూడా పట్టుకున్న వైనం 
  • మరో రెండు బాధిత యువతుల కథనాలు

కర్నూలు నగరం మాధవీనగర్‌ శివారులోని స్టేట్‌బ్యాంక్‌ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మూడో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. డోన్‌ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి కొంత కాలంగా స్టేట్‌ బ్యాంక్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.

అలాగే విటుడు జాకీర్‌హుసేన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. మహిళలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్వాహకుడు వెంకటేశ్వర్లుతో పాటు కీర్తిపై కేసు నమోదు చేశారు. అయితే కీర్తి పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు 

పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మిడుతూరు ఎస్సీకాలనీకి చెందిన అహల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి కొన్నాళ్లుగా మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ చెన్నయ్య ఆదివారం తెలిపారు.

తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబాయిలో వ్యభిచారం చేయించి ఆ డబ్బు తీసుకొని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన ఓ వివాహిత నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.ప్రభాకరరావు కథనం మేరకు-  26 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి పెద్దకుమార్తెతో కలిసి పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న తల్లి వద్దకు చేరుకుంది. 2017 నుంచి తల్లితోనే నివసిస్తోంది. అప్పటికే ఆమె తల్లి, వినుకొండకు చెందిన దూదేకుల మీరావలితో సహజీవనం చేస్తోంది. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపుతానని మీరావలి భయపెట్టాడు.

వివాహితతో బలవంతంగా వ్యభిచారం

అయితే దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబాయి తరలించి తొమ్మిది నెలలపాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికిన మీరావలి, సైదా తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు. తొమ్మిది నెలల అనంతరం నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా తనను కొట్టి మళ్లీ బలవంతంగా ఐదు నెలలపాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని పేర్కొంది. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని ఆ వివాహిత నిర్ణయించుకుంది. అయితే మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. తనతో బలవంతంగా వ్యభిచారం చేయించి సుమారు రూ.15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply