జనసేన ఎమ్మెల్యేపై కేసు…లొంగిపోనున్న రాపాక

police case against janasena mla
Share Icons:

అమరావతి:

 

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం నిన్న రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, వారిని విడిచి పెట్టాలని రాపాక వరప్రసాద్, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సుమారు 100 మంది కలసి పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వి, కిటికీ అద్దాలు పగలగొట్టారని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అన్నారు.

 

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. రాపాక వరప్రసాద్ పై గతంలో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని… ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈరోజు రాపాక మలికిపురం పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

 

 

Leave a Reply