కేంద్రం తొండాట. పోలవరం నిధులపై చేతులత్తేసే అడుగులు…

Share Icons:
  • 20 వేల కోట్లకన్నా పైసా ఎక్కువ ఇవ్వమన్న కేంద్ర ఆర్ధికమంత్రి
  • పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో పోలవరం జాతీయ ప్రాజక్టుగా ప్రకటించడమే కాక, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని  చట్టంలో పొందపరిచింది. ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ చేపట్టింది.టీడీపీ హయాంలోనే ప్రాజక్టు  54 కోట్ల రూపాయలు అవుతుందని కేంద్రానికి వివరమైన రిపోర్ట్ పంపింది . జగన్ నాయకత్వం లో వైసీపీ ప్రభుత్వ 2019 లో అధికారంలోకి వచ్చి, పనులు జరుగుతున్నాయి. జాతీయ ప్రాజక్టు పోలవరం కు  అప్పుడప్పుడు కేంద్ర  నిధులు రాబట్టుకుంటునప్పటికీ, 2017 లోనే 20 వేల కోట్లుగా నిర్దారించటం జరిగిందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్ నిధులు ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి స్పష్టం చేశారు. ఇంతే ఇస్తామని చెప్పటంపై రాష్టంలోని ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిని నిన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిసి విన్నవించారు. మరోవైపు రూ. 4 వేల కోట్లను పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ కూడా లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో బుగ్గనకు కేంద్ర ఆర్థిక శాఖ నిన్న పూర్తి క్లారిటీ ఇచ్చింది. అన్ని ప్రాజెక్టుల మాదిరే పోలవరంకు కూడా నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 2017లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదాని ప్రకారం రూ. 20 వేల కోట్లకు మించి ఇవ్వలేమని ఆమె స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో పోలవరంకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply