నవయుగ, సీఎం రమేశ్ సంస్థలకు జగన్ షాక్: కాంట్రాక్ట్ రద్దులకు కేబినెట్ ఆమోదం

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి:

ఇటీవల హైడల్ పవర్ ప్రాజెక్టు నుంచి తప్పిస్తూ ఏపీ పభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని పైన నవయుగ హైకోర్టును ఆశ్రయించింది. ఇక దీనిపై విచారణ చేసిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే తాజాగా దీని పైన ప్రభుత్వ అప్పీల్ కు వెళ్లగా కోర్టులో దీని పైన విచారణ సాగుతోంది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం కాంట్రాక్ట్ విషయంలో నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నవయుగ కంపెనీ పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అదే విధంగా నవయుగకు చెందిన రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దీంతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెందిన సంస్థకు జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ హయాంలో సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు-నగరి పనులను రిత్విక్‌ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గాలేరు-నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుని, పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది.

గత ప్రభుత్వం ఎన్నికల చివరి నిమిషంలో గాలేరు-నగరి పనులకు సంబంధించి రూ.795 కోట్లు పనులను అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీకి కట్టబెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి వారం రోజులముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకునేందుకు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టు పావులు కదిపింది. అప్పటి సీఎంఓ జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను రిత్విక్‌కు కట్టబెట్టడంలో కీలక భూమిక పోషించారనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో రమేశ్ చెందిన సంస్థ టెండర్లు రద్దు చేసి రీ టెండరింగ్ కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

Leave a Reply