ఈ నెల 11న మొదలు కానున్న పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ సేల్స్

Share Icons:

ముంబై: మొబైల్స్‌ తయారీదారు పోకో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ పోకో ఎక్స్‌2ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.16,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.19,999గా ఉంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1వేయి వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.

స్నాప్‌డ్రాగన్‌ 730జి పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తోపాటు 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే లిక్విడ్‌ కూలింగ్‌ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఈ ఫోన్‌లో యూజర్లకు లభిస్తున్నది.  ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ భారీ కెపాసిటీ కలిగిన కెమెరాతోపాటు 8, 2, 2 మెగాపిక్సల్‌ కెపాసిటీ కలిగిన మరో 3 కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20, 2 మెగాపిక్సల్‌ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు కాప్చర్‌ చేయవచ్చు.

పోకో ఎక్స్‌2 ఫీచర్లు…

6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జి ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌

64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌

64, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, వీవోవైఫై, బ్లూటూత్‌ 5.0

20, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐఆర్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి

4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

పోర్టబుల్‌ స్పీకర్‌

ఫింగర్స్‌ కంపెనీ సూపర్‌లైట్‌ పేరిట నూతన పోర్టబుల్‌ స్పీకర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.2299 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్‌లో ఆర్‌జీబీ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. బ్లూటూత్‌ 5.0 ద్వారా దీన్ని ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. 45ఎంఎం డ్రైవర్స్‌ను కలిగి ఉన్నందున ఈ స్పీకర్‌ నుంచి వచ్చే సౌండ్‌ అవుట్‌పుట్‌ బాగుంటుంది. ఎఫ్‌ఎం రేడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ఫీచర్లను కూడా ఈ స్పీకర్‌లో అందిస్తున్నారు. ఈ స్పీకర్‌లో 2000 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉన్నందున 9 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్‌ వినవచ్చు.

 

Leave a Reply