మోదీ బయోపిక్…. ‘పీఎమ్ నరేంద్ర మోదీ’

Share Icons:

ముంబయి, 4 డిసెంబర్:

ఈ మధ్య సినీ పరిశ్రమలో బయోపిక్‌ల జోరు కొనసాగుతుంది. టాలీవుడ్, కొలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ సినీ పరిశ్రమలలో ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపికలు సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు ఒమంగ్ కుమార్ సన్నాహాలు మొదలపెట్టారు. ఇక నరేంద్ర మోదీ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను ఎంపిక చేసుకున్నారు.
సందీప్ సింగ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘పీఎమ్ నరేంద్ర మోదీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోదీ, అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్న ఘటనల ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది.

మామాట: ఇంకెన్ని బయోపిక్‌లు వస్తాయో… 

Leave a Reply