కేరళ సీఎంకు నాల్గవసారి అపాయింట్‌మెంట్ ఇవ్వని ప్రధాని..

Share Icons:

ఢిల్లీ, 22 జూన్:

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధానమంత్రి కార్యాలయం వరుసగా నాలుగోసారి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యేందుకు ప్రయత్నించిన విజయన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది.

రాష్ట్రానికి రేషన్ కేటాయింపులో అసమానతలపై చర్చించేందుకు కేరళ సీఎం విజయన్ ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరారు.

అయితే ప్రధాని కార్యాలయం దీనికి స్పందిస్తూ… సీఎం కావాలంటే కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌తో సమావేశం కావచ్చునంటూ చెప్పినట్టు సమాచారం.

కాగా, ఇలా ప్రధానితో భేటీ నిరాకరించడం విజయన్‌కు ఇది నాల్గవసారి. ఇదే అంశంపై గత వారంలో కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు.

అలాగే అంతకుముందు 2017 మార్చి 20న రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్‌పై చర్చించేందుకు ఒకసారి, పెద్దనోట్ల రద్దు జరిగిన వారం రోజుల తర్వాత 2016 నవంబర్ 24న ఈ అంశంపై చర్చించేందుకు మరోసారి విజయన్ మోదీని కలుసుకునేందుకు ప్రయత్నించారు.

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా సీఎం విజయన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

మామాట: సొంత పార్టీ సీఎంలకు అయితే అపాయింట్‌మెంట్ త్వరగానే దొరుకుద్ది అనుకుంటా!

Leave a Reply